‘పుష్ప : ది రూల్’ (Pushpa2) సినిమా ట్రైలర్ చూడగానే అల్లు అర్జున్ (Allu Arjun) నటన, సుకుమార్(Sukumar) టేకింగ్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ గుర్తొస్తాయి. అయితే ‘వన్: నేనొక్కడినే’ సినిమా సమయంలో హర్ట్ అయిన తెలుగు సినిమా ఫ్యాన్స్‌కి మాత్రం మరో విషయం కూడా గుర్తొస్తుంది. దానికి కారణమైన హీరోయిన్ గుర్తొస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో చెబితే ఆ విషయం ఏంటో గుర్తొస్తుంది. ఆమెనే సమంత (Samantha) . ఇప్పుడు గుర్తొచ్చిందిగా ‘హీరో వెనుక హీరోయిన్ వెళ్తున్న సీన్’.
ఇప్పుడు ‘వన్: నేనొక్కడినే’ (1: Nenokkadine) విషయం గురించి చర్చించడం మామూలుగా అయితే పెద్ద విషయం కాదు. అయితే ఆ సమయంలో సుకుమార్‌ను చాలా మంది విమర్శించారు. ‘హీరో అలా బీచ్ ఒడ్డున నడుస్తుంటే.. ఆ అడుగుల్లో హీరోయిన్ మోకాళ్ల మీద నడవాలా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రోడ్డు మీద పోస్టర్ చూశా.. ఇది సరికాదు అంటూ అప్పట్లో సమంత కూడా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే, ఇప్పుడు అదే దర్శకుడు ‘పుష్ప 2’లో ఓ సీన్ పెట్టారు. ఇందులో హీరోయిన్ (రష్మిక మందన) (Rashmika Mandanna) కాళ్లను పట్టుకుని పాదంతో తన గడ్డం దువ్వుకుంటాడు. అందులో ఏముంది భార్య పాత్ర కాబట్టి అలా ప్రేమగా చేశాడు అని అనొచ్చు. అయితే చేతిలో దువ్వుకుంటే సరిపోయేది కదా.. కాళ్లతో దువ్వుకునేలా సీన్ ఎందుకు. మగాళ్ల గౌరవాన్ని తగ్గించడం కాదా అనే మాట అనొచ్చు. కానీ అలా అనడం లేదు. ఆ సీన్ అద్భుతంగా ఉంది అంటున్నారు.
ఇక్కడ విషయం ఏంటంటే.. ఆ సిట్యువేషన్‌కి తగ్గట్టు, ఆ సీన్ అవసరానికి తగ్గట్టు హీరో, హీరోయిన్ నటిస్తారు. అంతే తప్ప ఇక్కడ ఎవరి గౌరవాన్ని తగ్గించడం ఉండదు. అయితే ‘అలా అబ్బాయి గడ్డాన్ని అమ్మాయి కాళ్లతో దువ్వడం కరెక్ట్ కాదు’ అని సమంత ఇప్పుడేమన్నా సోషల్ మీడియాలో అంటారేమో చూడాలి. ఎందుకంటే అందరూ సమానమే కదా.