కంగువాలో లోపాలు ఉన్నాయి, కానీ: జ్యోతిక

సూర్య నటించిన పాన్ ఇండియా మూవీ ‘కంగువా’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్‌తో గ్రీన్ స్టూడియోస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమిళ దర్శకుడు శివ దర్శకత్వం వహించారు. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటించగా, సూర్య ద్విపాత్రాభినయం చేశారు. అయితే ఈ సినిమాపై సూర్య సతీమణి, నటి జ్యోతిక తాజాగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

జ్యోతిక మాట్లాడుతూ, ‘‘కంగువా ఓ అద్భుతమైన సినిమా. సూర్య నటన గొప్పగా ఉంది. మొదటి 30 నిమిషాలు కొంచెం స్లోగా అనిపించినప్పటికీ, చిత్రానికి ఉండే విజువల్స్, కథా తీరుకు ఇది సరిపోయింది. సౌండ్ ట్రాక్ కొంచెం లౌడ్‌గా ఉంది, కానీ ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాల్లో చిన్న లోపాలు సహజం’’ అని చెప్పింది. మొదటి భాగం అంతగా ఆకట్టుకోకపోయినా, సెకండ్ హాఫ్ లో కథ బాగా పుంజుకుందని ఆమె అభిప్రాయపడింది.

సినిమాపై వస్తున్న నెగటివ్ రివ్యూల గురించి జ్యోతిక అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఇలాంటి చిత్రాలు చాలా కష్టం మీద నిర్మితమవుతాయి. మహిళలపై సెంటిమెంట్, ఫైట్ సీన్స్ మంచి భావోద్వేగాలను చూపించాయి. అయినా వాటిపై చర్చ జరుగకపోవడం బాధగా ఉంది. సినిమా బృందం చేసిన కృషిని గుర్తించి అభినందించడం ముఖ్యం,’’ అని ఆమె అన్నారు. ఏదేమైనా జ్యోతిక నెగిటివ్ రివ్యూలపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక ‘కంగువా’ కథ వెయ్యేళ్ల పురాతన కాలానికి, ఆధునిక కాలానికి ముడిపడి ఉండగా, సూర్య ఫ్రాన్సిస్, కంగువా పాత్రల్లో అద్భుతంగా మెప్పించారు. దిశా పటానీ పాత్ర ఆకట్టుకోగా, బాబీ డియోల్ ప్రతినాయకుడిగా చక్కటి నటన కనబరిచారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం ఒక విభిన్న అనుభూతిని అందించిందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఇక జ్యోతిక రివ్యూ అభిమానులను ఆలోచనలో పడేసింది. ‘‘ప్రతీ సినిమాలో తప్పులు ఉండవచ్చు, కానీ కృషిని గుర్తించాలి’’ అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు సినిమాకు సపోర్ట్ కలిగిస్తాయో లేదో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus