Pushpa2: పుష్ప రాజ్ గాడి ప్యాన్ ఇండియన్ క్రేజ్ మాములుగా లేదుగా!

ఒక తెలుగు సినిమాకి నార్త్ ఇండియాలో, అది కూడా బీహార్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది అని కనీసం కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు. కానీ అల్లు అర్జున్ (Allu Arjun) దాన్ని సుసాధ్యం చేశాడు. “పుష్ప” (Pushpa2) సినిమా తెలుగులో కంటే హిందీలో పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ పుణ్యమా అని అ సినిమాకి నార్త్ లో భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

Pushpa2

అందుకే.. సినిమాకి మొదటి ఈవెంట్ అయిన ట్రైలర్ లాంచ్ ను బీహార్ రాష్ట్రంలోని పాట్నా నగరంలో నిర్వహించారు. ఏదో చిన్న ఈవెంట్ అయ్యుంటుందిలే అనుకుంటే.. ఈవెంట్ విజువల్స్ చూసినవాళ్లందరినీ షాక్ కు గురిచేసింది.

అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక (Rashmika) హాజరైన ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి దాదాపు 2 లక్షల మంది జనాలు హాజరు కాగా, బీహార్ ప్రభుత్వం స్వయంగా 900 మంది పోలీసులను, 200 ప్రైవేట్ సెక్యూరిటీని ఈవెంట్ కోసం కేటాయించడం, ఏకంగా బీహార్ ఉప ముఖ్యమంత్రి వినయ్ సిన్హా ఈవెంట్ కు హాజరవ్వడం పుష్ప రాజ్ గాడి క్రేజ్ ఎలా ఉంది అనేందుకు ప్రతీకగా నిలిచింది. ఇప్పటివరకు బీహార్ లో ఈ తరహా ఈవెంట్ అవ్వడం ఇదే మొదటిసారి.

భవిష్యత్ లో ఎవరైనా నిర్వహించినా ఈ స్థాయి క్రేజ్ & జనాలు వస్తుందని ఊహించడం కూడా కష్టమే. సినిమా విడుదల తర్వాత కూడా తెలుగులో కంటే హిందీలో ఎక్కువ కలెక్షన్స్ సాధించడం ఖాయం అని ఈ ఈవెంట్ ప్రూవ్ చేసింది. అందుకే నార్త్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీ చాలా ఎక్కువ రేట్ పెట్టి “పుష్ప 2” (Pushpa2) రైట్స్ కొనుక్కున్నాడు.

ఇకపోతే.. ట్రైలర్ మాస్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా పుష్పగాడి ఎలివేషన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ కు మంచి స్పందన లభించింది. దర్శకుడు సుకుమార్ ఎప్పట్లానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉండిపోయి ఈవెంట్ కు హాజరవ్వలేకపోయాడు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న “పుష్ప 2”లో పార్ట్ 1 కంటే ఎక్కువ క్యాస్ట్ కనిపించబోతోందని ట్రైలర్ తో రుచి చూపించారు. సినిమాకి గనుక ఫస్ట్ డే పాజిటివ్ టాక్ వచ్చిందంటే.. బాహుబలి రికార్డులు, కేజీఎఫ్ రికార్డులు కలిపి కొల్లగొట్టడం ఖాయం. అలా జరిగితే మాత్రం అల్లు అర్జున్ స్టార్ డమ్ కి కొన్నేళ్లపాటు తిరుగు ఉండదు.

పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది.. వైల్డ్ ఫైర్ అంతే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus