Shruti Haasan: ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్‌ పార్టీకి శ్రుతి వస్తుందా?

  • January 25, 2023 / 11:03 AM IST

‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్‌ పార్టీ ఎప్పుడు? గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో దీని గురించే చర్చ నడుస్తోంది. అదే సమయంలో సోషల్‌ మీడియాలోనూ డిస్కషన్‌ జరుగుతోంది. అయితే రెండింటిలోనూ ‘వాల్తేరు వీరయ్య’ కామన్‌ కానీ.. డిస్కషన్‌ మాత్రం వేర్వేరు టాపిక్‌ల కోసం. తొలుత సోషల్‌ మీడియాది చూస్తేద్దాం. ఆ తర్వాత ఇండస్ట్రీ సంగతికి వెళ్దాం. ఏ మాటకు ఆ మాట రెండూ ఆసక్తికరంగానే ఉన్నాయి తెలుసా? ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకుపైగా వసూళ్లు వచ్చాయని చిత్రబృందం పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.

సినిమా వచ్చి రెండు వారాలు పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిపేస్తే బాగుంటుంది కదా అని అభిమానులు కోరుకుంటున్నారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి సినిమా టీమ్‌ అంతా ఓ స్టేజీ మీదకు వచ్చి అభిమానులకు ఆనందం కలిగిచడం, రెండో ఆ టీమ్‌లో శ్రుతి హాసన్‌ ఉంటుందా లేదా అనేది తెలియడం. లాజిక్‌ అర్థమైందా? ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రచారంలో శ్రుతి హాసన్‌ ఎక్కడా కనిపించలేదు.

సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు, అంతకుముందు పెట్టిన ప్రెస్‌ మీట్‌, రిలీజ్‌ తర్వాత పెట్టిన ప్రెస్‌ మీట్‌ ఇలా దేని శ్రుతి హాజరు కాలేదు. దీని మీద చిరంజీవి ‘ఎవరైనా భయపెట్టారేమో’ అనే జోక్‌ కూడా వేశారు. అప్పుడంటే హెల్త్‌ ఇష్యూస్‌, వేరే పనులు అని వాయిదా వేసింది. మరి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి అయినా వస్తుందా? లేదంటే ఏదైనా కారణం చెప్పి ఎగ్గొడుతుందా? అనేది తెలుసుకోవాలనేది నెటిజన్ల కోరిక.

ఇక ఇండస్ట్రీ సంగతికొస్తే.. ఎంతవసూలు చేసిందో లెక్క చెప్పకుండా ‘వీర సింహుని విజయోత్సవం’ నిర్వహించారు. మరి 200 కోట్ల రూపాయలు వసూలు చేసిన ‘వాల్తేరు వీరయ్య’కు విజయోత్సవం లేదా అనేది ప్రశ్న. అయితే చిరంజీవి ప్రస్తుతం ‘భోళా శంకర్‌’ షెడ్యూల్‌లో బిజీగా ఉండటం వల్ల ‘వీరయ్య విజయోత్సవం’ ఆలస్యం అంటున్నారు. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus