బిగ్ బాస్4: ఈవారం ఎలిమినేషన్ లేదా..?

  • October 23, 2020 / 05:07 PM IST

బిగ్ బాస్ హౌస్ లో ప్రతివారం ఏదో ఒక ట్విస్ట్ ఉంటునే ఉంటోంది. లాస్ట్ టైమ్ సీజన్ కంటే కూడా ఈసారి సీజన్ లో ట్విస్ట్ లు ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఎలిమినేషన్ చాలా అన్ ఫెయిర్ గా జరుగుతోందని సోషల్ మీడియాలో షోపై ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 7వ వారం ఎలిమినేషన్ అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది బిగ్ బాస్ లవర్స్ లో క్యూరియాసిటీనీ పెంచుతోంది. అసలు ఎలిమినేషన్ ఉంటుందా.. దసరా స్పెషల్ కాబట్టి పండగ సందర్భంగా అందరూ ఎంజాయ్ చేయండి అంటూ ఎలిమినేషన్ అనేది తీసేస్తారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాని వేడెక్కిస్తోంది.

అసలు మేటర్ లోకి వెళితే.., ఈసారి సీజన్ లో ఫేక్ ఎలిమినేషన్ అనేది ఒకసారి చేశారు. గేట్ వరకూ వెళ్లిన హారిక ఎలి్మినేషన్ లేదనే సరికి వెనక్కి వచ్చింది. ఈసారి ఎవరూ సెల్ఫ్ నామినేట్ అవ్వకుండా ఇది ఒక లెస్సన్ అని చెప్పి నాగార్జున ఎక్స్ ప్లైయిన్ చేసి వెళ్లిపోయాడు. అప్పుడు అందరూ కూడా డబుల్ ఎలిమినేషన్ అనే అనుకున్నారు. కానీ సీన్ వేరేలా మారింది. ఇక తర్వాత మూడోవారం దేవినాగవల్లి ఎలిమినేషన్ ని సోషల్ మీడియా తీవ్రంగా ఖండించింది. ఓటింగ్ లీస్ట్ లో మెహబూబ్ ఉంటే దేవినాగవల్లి ఎలా వెళ్లిపోతుందని చాలామంది కామెంట్స్ చేశారు.
ఆ తర్వాత 5వ వారం కుమార్ సాయి ఎలిమినేషన్ కూడా ఇలాగే ఖండించి పోస్ట్ లు పెట్టారు.

బిగ్ బాస్ హౌస్ లో ఓటింగ్ కి వాల్యూ లేదా అని ప్రశ్నించారు అందరూ. అప్పుడు డేంజర్ జోన్ లో మోనాల్ ఓటింగ్ లో లీస్ట్ లో ఉంది. సేఫ్ అయ్యింది. ఇప్పుడు కూడా ఎలిమినేషన్ అనేది ఉంటుందా లేదా అని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఓటింగ్ లీస్ట్ లో ఈసారి కూడా మోనాల్ డేంజర్ జోన్ లోనే ఉంది. ఇప్పుడు ఎలిమినేషన్ అనేది పండగ సందర్భంగా జరగకపోతే ఖచ్చితంగా మళ్లీ మోనాల్ సేఫ్ అవుతుందనే అంటున్నారు అందరూ. మరి చూద్దాం.. బిగ్ బాస్ హౌస్ లో ఈసారి ఏం జరుగుతుందో..!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus