Devara OTT: ‘దేవర’ ఓటీటీ రిలీజ్ నవంబర్ 22 కి మారిందా… నిజమెంత?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)  నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’ (Devara) సెప్టెంబర్ 27న విడుదలయ్యింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా కొంత మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ… ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన సినిమా కావడంతో.. అభిమానులు ఎగబడి చూశారు. హాలిడేస్ కూడా కలిసి రావడంతో.. కామన్ ఆడియన్స్ కూడా భారీగా థియేటర్లకు తరలివచ్చి ‘దేవర’ ని చూశారు. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సాధించి బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్ స్టామినా ఏంటో చాటి చెప్పింది ‘దేవర’ చిత్రం.

Devara OTT

కొరటాల శివ  (Koratala Siva)  డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటించింది. అనిరుధ్ (Anirudh Ravichander) సంగీతంలో రూపొందిన పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ముఖ్యంగా ‘ఆయుధపూజ’ సాంగ్లో ఎన్టీఆర్ సింగిల్ లెగ్ పై వేసిన స్టెప్స్ అదరహో అనిపిస్తాయి. అలాగే శ్రీకాంత్ (Srikanth) , సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)  ..ల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగా పండాయి.

అందువల్లే థియేటర్లలో ‘దేవర’ని మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. నవంబర్ 8న ‘దేవర’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇప్పుడు పోస్ట్ పోన్ అయినట్టు టాక్ నడుస్తుంది.’దేవర’ ఓటీటీ రిలీజ్ నవంబర్ 22 కి వాయిదా పడినట్టు అంతా చెబుతున్నారు. కానీ అందులో నిజం లేదు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 8 నుండే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ‘దేవర’. అయితే హిందీ వెర్షన్ మాత్రం నవంబర్ 22 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ కన్ఫ్యూజన్లోనే ‘దేవర’ పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు మొదలయ్యాయి అని చెప్పొచ్చు.

కిరణ్ అబ్బవరం ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus