Balakrishna: ఇప్పటివరకు సంక్రాంతికి రిలీజ్ అయిన బాలయ్య సినిమాలు ఇవే..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇన్ని రోజులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల ఆకలి తీర్చబోతున్నాడు. సంక్రాంతికి సింహం సిద్ధం అంటూ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ రివీల్ చేశారు. ‘వీర సింహా రెడ్డి – గాడ్ ఆఫ్ మాసెస్’ అనే పవర్ ఫుల్ పేరు పెట్టి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చారు..

బాలయ్యకీ, సంక్రాంతికీ అవినాభావ సంబంధం ఉంది.. నందమూరి నటసింహాన్ని ఇండస్ట్రీ వర్గాలవారు సంక్రాంతి సింహం అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఆయన కెరీర్లో పెద్ద పండగప్పుడు రిలీజ్ అయిన సినిమాలు మెజారిటీ శాతం సూపర్ హిట్స్ అయ్యాయి. పైగా టైటిల్ లో ‘సింహా’ ఉండంతో ఆ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ గా ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’ సినిమాలను చెప్పుకోవచ్చు.

వాటి తర్వాత త ‘లక్ష్మీ నరసింహా’, ‘జైసింహా’ చిత్రాల తర్వాత వస్తున్న ఈ ‘వీర సింహా రెడ్డి’ మీద అంచనాలు ఎలా ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలకుపైగా కెరీర్ కలిగిన నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన పలు చిత్రాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.. ఆ సినిమాలేంటో ఓసారి చూద్దాం..

భార్గవ రాముడు – 14 జనవరి 1987

ఇన్స్ పెక్టర్ ప్రతాప్ – 15 జనవరి 1988

ప్రాణానికి ప్రాణం – 12 జనవరి 1990

వంశానికొక్కడు – 5 జనవరి 1996

పెద్దన్నయ్య ‌- 10 జనవరి 1997

సమరసింహా రెడ్డి ‌- 13 జనవరి 1999

వంశోద్ధారకుడు – 14 జనవరి 2000

నరసింహ నాయుడు – 11 జనవరి 2001

సీమసింహం – 11 జనవరి 2002

లక్ష్మీ నరసింహా – 14 జనవరి 2004

ఒక్కమగాడు – 8 జనవరి 2008

పరమవీర చక్ర – 12 జనవరి 2011

డిక్టేటర్ – 16 జనవరి 2016

గౌతమిపుత్ర శాతకర్ణి – 12 జనవరి 2017

జై సింహా – 12 జనవరి 2018

ఎన్టీఆర్ కథానాయకుడు – 9 జనవరి 2019

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus