Trivikram: త్రివిక్రమ్‌ సెంటిమెంట్‌ కంటిన్యూ చేస్తాడా?

Advertisement

త్రివిక్రమ్‌ సినిమాల్లో ఓ సెంటిమెంట్‌ మొన్నీ మధ్య మనం మాట్లాడుకున్నాం. రీసెంట్ టైమ్స్‌లో ఆయన సినిమాల్లో ఓ సీనియర్‌ హీరోయిన్‌ను తీసుకొస్తుంటారు. అత్త పాత్రో, తల్లి పాత్రో, పిన్ని పాత్రనో ఇస్తుంటారు. అలాంటి పాత్రలన్నీ మంచి పేరే తెచ్చుకున్నాయి. దీంతో పాటు ఆయన సినిమాల్లో ఇలాంటి సెంటిమెంట్‌ ఇంకొకటి కూడా ఉంది. అదే సెకండ్‌ హీరోయిన్‌. అంటే ఇంకో హీరోయిన్‌ అన్నమాట. అలా అని ఆమె హీరోయిన్‌ కాదు. కీలక పాత్రనా అంటే కొన్నిసార్లు మాత్రమే అని చెప్పాలి.

‘అల వైకుంఠపురములో..’లో నివేదా పేతురాజ్‌, ‘అరవింద సమేత’లో ఈషా రెబ్బా, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’లో అదా శర్మ, ‘అత్తారింటికి దారేది’లో ప్రణీత… ఈ సినిమాల్లో రెండో హీరోయిన్‌ ఉంటుంది. కానీ రెండో హీరోయిన్‌ కాదు. హీరోతో కాంబినేషన్‌ సీన్లు తక్కువ, అసలు ఆ హీరో కోసం ఆమెను హీరోయిన్‌గా తీసుకోలేదు కూడా. సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌ అంతే. ఇప్పుడు త్రివిక్రమ్‌… మహేష్‌తో జట్టుకట్టాడు. SSMB28గా రాబోతున్న ఈ సినిమాలో ఆ ‘సెకండ్‌’ హీరోయిన్‌ ఎవరో మరి.

ఇక ఈ సినిమాలో మహేస్‌ సరసన ఇద్దరు హీరోయిన్లు ఉంటారని వార్తలొస్తున్నాయి. ఒకరు పూజా హెగ్డే అని అంటున్నారు. అయితే ఆమె ఇంకా ఓకే చెప్పలేదట. రెండో హీరోయిన్‌ కోసం సెర్చింగ్‌ మొదలైందంట. త్వరలోనే ఆ పాత్ర ఎంపిక పూర్తి చేస్తారట. అంటే ఈ లెక్కన ఈ సినిమాలో ముగ్గురు భామలు ఉండబోతున్నారు. ఇద్దరు హీరోయిన్లు, ఒక ‘సెకండ్‌’ హీరోయిన్. చూద్దాం మరి మహేష్‌తో ఆడిపాడబోయే భామలు ఎవరో.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus