Wonder Women Review: వండర్ ఉమెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నిత్యామీనన్ (Hero)
  • నిత్యామీనన్ (Heroine)
  • నదియా, పార్వతి, పద్మప్రియ తదితరులు.. (Cast)
  • అంజలి మీనన్ (Director)
  • ఆశీ దువా - రోనీ స్క్రూవాలా (Producer)
  • గోవింద్ వసంత (Music)
  • మనీష్ మాధవన్ (Cinematography)
  • Release Date : నవంబర్ 18, 2022

“బెంగళూరు డేస్” అనే మలయాళ చిత్రంతో ఇండియన్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న దర్శకురాలు అంజలీ మీనన్ తెరకెక్కించిన తాజా చిత్రం “వండర్ ఉమెన్”. సోనీ లైవ్ యాప్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..!!

కథ: నెలలు నిండడానికి సిద్ధంగా ఉన్న ఏడుగురు మహిళలు “సుమన” అనే వసతి గృహానికి చేరుకుంటారు. ఒక్కో మహిళదీ ఒక్కో కథ.. నోరా (నిత్యామీనన్), మినీ (పార్వతి), వేణి (పద్మప్రియ), సాయా సాయనోర ఫిలిప్), గ్రేసీ (అర్చన పద్మిని), జయ (అమృత సుభాష్)లు.. నందిత (నదియా) నిర్వహిస్తున్న “సుమన”లో జాయినవుతారు.

ఈ క్రమంలో వాళ్ళు గర్భం దాల్చడానికి ఎలాంటి పడిన కష్టం ఏమిటి?, అమ్మతనాన్ని వాళ్ళు ఎలా ఆస్వాదించారు? వ్యక్తిత్వం పరంగా ఎలాంటి మార్పులు చవిచూశారు? అనేది “వండర్ ఉమెన్” కథాంశం.

నటీనటుల పనితీరు: అందరూ కాబోయే తల్లులుగా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయినప్పటికీ.. అందరికంటే ఎక్కువగా ఆకట్టుకున్న నటి మాత్రం అమృత సుభాష్. ఆమె కథకి ఎమోషనల్ కనెక్ట్ ఉండడమే కాక, నవతరం కపుల్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే కథ కావడంతో ఆమె పాత్ర అందరికంటే బాగా ఎలివేట్ అయ్యింది. వీళ్ళందరినీ డామినేట్ చేసిన నటి నదియా. ఆమె నటన, హావభావాలు, బాడీ లాంగ్వేజ్ & ఎమోషనల్ సీన్స్ లో ఆమె ప్రదర్శించిన పరిణితి చూస్తే మనసు నిండుతుంది.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ మనీష్ మాధవన్ సినిమాటోగ్రఫీ. చాలా కలర్ ఫుల్ గా, ప్లెజంట్ గా సినిమాని ప్రెజంట్ చేశాడు. గోవింద్ వసంత సంగీతం కూడా బాగుంది. ఎమోషన్స్ ను చక్కగా ఎలివేట్ చేసింది. ప్రొడక్షన్ డిజైన్ & డి.ఐ వర్క్ కూడా బాగుంది.

దర్శకురాలు అంజలి మీనన్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే.. ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. అందుకు కారణం ఆమె ట్రాక్ రికార్డ్. ఆమె దర్శకత్వంలో వచ్చిన “బెంగుళూరు డేస్, కూడే” లాంటి సినిమాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అందుకే “వండర్ ఉమెన్” సినిమాపై భారీ అంచనాలున్నాయి. అన్నిటికీ మించి.. నిత్యామీనన్, పార్వతి, పద్మప్రియ, నదియా లాంటి నటీమణులు కూడా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరిగాయి.

అయితే.. అంజలి నుంచి ఆశించే స్థాయి ఎమోషనల్ కనెక్టివిటీ ఈ సినిమాలో లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. అంతా బాగుంది కానీ.. ఎక్కడో ఎమోషనల్ హై మిస్ అయ్యింది. ఎంత వెబ్ ఫిలిమ్ అయినప్పటికీ.. ఎమోషనల్ ఎలివేషన్ అనేది చాలా ముఖ్యం. భార్యాభర్తల కన్ఫెషన్ ఎపిసోడ్ & హాస్పిటల్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ మినహా ఆ ఎమోషనల్ ఎలివేషన్ ఎక్కడా లేకపోవడం “వండర్ ఉమెన్”లో మైనస్ గా చెప్పొచ్చు. దర్శకురాలిగా ఆకట్టుకున్న అంజలి మీనన్.. కథకురాలిగా మాత్రం నిరాశపరిచింది.

విశ్లేషణ: అంజలి మీనన్ నుంచి ఆశించే మార్క్ ఎమోషన్స్ & హ్యూమన్ టచ్ మిస్ అవ్వడంతో “వండర్ ఉమెన్” కాస్త నిరాశపరుస్తుంది. అయితే.. నిత్యామీనన్, పార్వతి, పద్మప్రియ, అమృత సుభాష్ లాంటి టాలెంటెడ్ హీరోయిన్స్ అందర్నీ ఒకే ఫ్రేమ్ లో చూడడం అనే అనుభూతి మాత్రం బాగుంది. అందుకోసం మాత్రమే సోనీ లైవ్ లో ఒకసారి చూడదగ్గ చిత్రంగా “వండర్ ఉమెన్”ను చెప్పుకోవచ్చు.

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus