Yash, Radhika Pandit: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన యష్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • July 2, 2021 / 02:31 PM IST

‘కె.జి.ఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన కన్నడ స్టార్ హీరో యష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇతను నటించిన ‘కె.జి.ఎఫ్2’ కోసం ఇప్పుడు ఇండియా వైడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘కె.జి.ఎఫ్2’ టీజర్ ఎటువంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కుదేలైపోయిన సినీ పరిశ్రమకి పూర్వ వైభవాన్ని తెచ్చే బాధ్యత ‘కె.జి.ఎఫ్2’ దే అంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు.

ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ కనుక స్టార్ట్ అయితే మరోసారి విడుదల వాయిదా పడే అవకాశం కూడా ఉంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే..తాజాగా యష్, తన భార్య రాధిక పండిట్ తో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టాడు.బెంగళూరులోని ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్‌మెంట్‌లో ఇంటిని కొనుగోలు చేసాడట యష్.వీరి గృహప్రవేశం నిన్న సాయంత్రం అంటే జూలై 1న సాయంత్రం జరిగినట్టు స్పష్టమవుతుంది.

ఈ జంట తమ బంధువుల సమక్షంలో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. దీనికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus