‘కె.జి.ఎఫ్’ యశ్, విజయ్ సేతుపతి.. సేమ్ మిస్టేక్ చేస్తున్నారా?

  • February 27, 2021 / 11:03 AM IST

కన్నడ హీరో కూడా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవుతాడని బహుశా ఎవ్వరూ అనుకుని ఉండరు. ముఖ్యంగా తెలుగు మార్కెట్ కూడా పెరుగుతుందని అంచనా కూడా వేసి ఉండరు. కానీ కె.జి.ఎఫ్ హీరో యశ్ ఆ ఘనతను సాధించాడు. అతని సినిమాలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ‘కె.జి.ఎఫ్2’ రైట్స్ రూ.50కోట్లకు పైనే పలుకుతుందంటే ఆ విషయం స్పష్టమవుతుంది. అయితే ‘కె.జి.ఎఫ్2’ విడుదలకు ముందే ‘గజకేసరి’ అనే డబ్బింగ్ చిత్రాన్ని విడుదల చెయ్యబోతున్నాడు యష్.

మార్చి 5న ఈ చిత్రం తెలుగులో విడుదల కాబోతుంది. నిజానికి ఈ చిత్రం కన్నడలో పెద్ద విజయం సాధించిందేమీ లేదు.పైగా ఇది 2014లో వచ్చిన సినిమా.. అయినప్పటికీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇక యష్ బాటలోనే విజయ్ సేతుపతి కూడా అడుగులు వేస్తున్నాడు. 2018 లో అతని నుండీ వచ్చిన ‘ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్’ అనే చిత్రాన్ని ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే టైటిల్ తో తెలుగులో విడుదల చెయ్యబోతున్నారు.

నిహారిక కొణిదెల తమిళ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రమిది. అక్కడ ఈ చిత్రం పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ ఇప్పుడు విజయ్ సేతుపతి క్రేజ్ పెరగడంతో తెలుగులోకి విడుదల చేస్తున్నారు.ఏదేమైనా ఇప్పుడిప్పుడే తెలుగులో ఎదుగుతున్న యశ్, విజయ్ సేతుపతి లు.. ఇక్కడ మార్కెట్ ఉంది కదా అని అక్కడ ప్లాపైన సినిమాలను డబ్ చేసి విడుదల చేసి.. క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుందేమో..!

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus