కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలతో కోట్ల సంఖ్యలో అభిమానులకు యశ్ దగ్గరయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరోలకు ధీటుగా యశ్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. యశ్ కు క్రేజ్ అంతకంతకూ పెరగడంతో ప్రముఖ కంపెనీలు యశ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. పెప్సీకి యశ్ బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న యశ్ ప్రముఖ బ్రాండ్ లకు ఓకే చెప్పడం ద్వారా క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నారు.
8 సెకన్ల వీడియోను యశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైనట్లు ప్రేక్షకులకు తెలిసేలా చేసేలా ప్రేక్షకులు యశ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. యశ్ ట్వీట్ కు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తుండటం గమనార్హం. యశ్ తర్వాత ప్రాజెక్ట్ విషయానికి వస్తే కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో యశ్ హ్యాట్రిక్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
టీషర్ట్ స్టైలిష్ జీన్స్ లో పెప్సీ తాగుతూ యశ్ షేర్ చేసిన వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ బ్రాండ్ వల్ల యశ్ రేంజ్ రెట్టింపు అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. యశ్ సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతుండటం గమనార్హం. యశ్ ప్రాజెక్ట్ లు 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది. యశ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 60 కోట్ల రూపాయల నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. యశ్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు.