సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని హరి, హరీష్ డైరెక్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ నవంబర్ 11న రిలీజ్ అయ్యింది.సరోగసి పద్ధతి నేపథ్యంలో సాగే కథాంశంతో..సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ తెరకెక్కింది. అది మాత్రమే కాకుండా సినిమాలో ఇంకా సర్ప్రైజ్ లు ఉన్నాయి.
మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకుంది.కానీ సోమవారం నుండి డల్ అయ్యింది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 3.09 cr |
సీడెడ్ | 0.53 cr |
ఉత్తరాంధ్ర | 0.68 cr |
ఈస్ట్ | 0.35 cr |
వెస్ట్ | 0.23 cr |
గుంటూరు | 0.39 cr |
కృష్ణా | 0.41 cr |
నెల్లూరు | 0.17 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 5.85 cr |
తమిళనాడు | 0.77 cr |
హిందీ | 0.46 cr |
ఓవర్సీస్ | 2.30 cr |
రెస్ట్ | 0.47 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 9.85 cr (షేర్) |
‘యశోద’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.20.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.21 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే పలు చోట్ల ఈ చిత్రాన్ని రెంటల్ బేస్ పైన ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు.ఇంకొన్ని చోట్ల అడ్వాన్స్ ల బేసిస్ మీదే విడుదల చేశారు. అందువల్ల ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.11.5 కోట్లుగా ఉందని ట్రేడ్ పండితుల సమాచారం.
అయితే 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.9.85 కోట్ల షేర్ ను రాబట్టింది. ఆ రకంగా చూసుకుంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.1.65 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఓవర్సీస్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు అందించింది. అయితే వీకెండ్ తర్వాత ఈ మూవీ చాలా డౌన్ అయ్యింది. ఈ కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ సాధించేలా కనిపించడం లేదు.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!