Yashoda Collections: బాగానే కలెక్ట్ చేసింది కానీ..!

  • November 12, 2022 / 02:47 PM IST

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. ‘శ్రీదేవి మూవీస్’ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని హరి, హరీష్ డైరెక్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ నవంబర్ 11న రిలీజ్ అయ్యింది.సరోగసి పద్ధతి నేపథ్యంలో సాగే కథాంశంతో..సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ తెరకెక్కింది. అది మాత్రమే కాకుండా సినిమాలో ఇంకా సర్ప్రైజ్ లు ఉన్నాయి.

మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా కూడా పర్వాలేదు అనిపించింది. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం  0.581 cr
సీడెడ్  0.17 cr
ఉత్తరాంధ్ర  0.22 cr
ఈస్ట్  0.08 cr
వెస్ట్  0.07 cr
గుంటూరు  0.11 cr
కృష్ణా  0.14 cr
నెల్లూరు  0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  1.65 cr
తమిళనాడు  0.18 cr
హిందీ  0.03 cr
ఓవర్సీస్  0.90 cr
రెస్ట్  0.22 cr
టోటల్ వరల్డ్ వైడ్  2.98 cr  (షేర్)

‘యశోద’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.20.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.21 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ మూవీ రూ.2.98 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.18.02 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

టార్గెట్ అయితే అంత ఈజీ కాదు.శని, ఆది వారాలు బాగా క్యాష్ చేసుకుని వీక్ డేస్ లో కూడా స్టడీగా రాణిస్తే తప్ప నవంబర్ వంటి అన్ సీజన్లో బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమనే చెప్పాలి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus