సూపర్ పాజిటివ్ టాక్ తో విడుదలవుతున్న యాత్ర
- February 7, 2019 / 12:55 PM ISTByFilmy Focus
సాధారణంగా స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకే విడుదలయ్యేవరకూ టాక్ ఏమిటనేది ఫిక్స్ అవ్వదు. ఒక్కోసారి సినిమా విడుదలైన రెండోరోజు కూడా సినిమా బాగున్నా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. కానీ.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన “యాత్ర” సినిమాకి మాత్రం ఇంకా మొదటి షో పడకముందే సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. అందుకు ముఖ్య కారణం సినిమా ట్రైలర్ & ప్రోమోస్ అయితే.. రెండోది మాత్రం దర్శకుడు మహి వి.రాఘవ సినిమాని ప్రమోట్ చేస్తున్న తీరు.
- ప్రకాష్ రాజ్ కు లీగల్ నోటీసులు.. కారణమేమిటంటే..!
- హీరో జై తో ఎఫైర్… పై అంజలి కామెంట్స్!
- హైద్రాబాద్ లో మహేష్ బాబు విగ్రహం
ఒకరి మనోభావాలు దెబ్బతినకుండా, ఎవరి అభీష్టాలను కించపరచకుండా చాలా చక్కగా సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు రాఘవ. మీడియా ఇంటర్వ్యూస్ టైమ్ లో అతడు చూపుతున్న చొరవ, పరిణితికి అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు. రేపు విడుదలవుతున్న సినిమా రిజల్ట్ ఏమిటి అనేది పక్కన పెట్టేసి.. ఒక అద్భుతమైన ప్రయత్నంగా మాత్రం సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు మహి. అతడి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించాలని కోరుకొందాం.














