చికిత్స కోసం అమెరికా వెళ్లిన యంగ్ హీరోయిన్..!

ఒక‌ప్ప‌టి అగ్ర‌తార‌ హీరోయిన్స్ ల్లో రాధ ఒకరు. చిరంజీవి, బాల‌కృష్ణ‌, కృష్ణ వంటి అగ్ర‌హీరోల‌తో తెర‌ను పంచుకుని.. త‌న‌కంటూ.. ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న న‌టీమ‌ణి. ఆ త‌ర్వాత‌.. వివాహం చేసుకుని తెర‌మ‌రుగైనా.. ఆమె కుమార్తెలు.. కార్తీక‌, తుల‌సిల‌ను మాత్రం తెలుగుకు ప‌రిచ‌యం చేసింది. అయితే.. వీరిలో చిన్న‌మ‌య్యాయి తుల‌సి ఇప్పుడు దారుణ ప‌రిస్థితిలో ఉంద‌ని ఇండ‌స్ట్రీలో వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఈమెది సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ ఉన్న రాధ స్టార్ హీరోయిన్ గా రికార్డు సృష్టించింది.

త‌ర్వాత‌.. 15 ఏళ్ల‌కు ఆమె ఓ పారిశ్రామిక వేత్త‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్ద‌రు కుమార్తెలు. ఇద్ద‌రూ తెర‌మీద‌కి వ‌చ్చారు. రాధ పెద్ద కూతురు కార్తీక.. నాగచైతన్య ‘జోష్’ సినిమాతో హీరోయిన్ అయ్యింది. కాకపోతే ‘రంగం’ సినిమా తర్వాత తమిళంలోనే ఎక్కువగా మూవీస్ చేసి అక్క‌డే స్థిర‌ప‌డింది. అయితే రెండో కుమార్తె తులసి మాత్రం యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేక‌పోవ‌డంతో తొలి సినిమాకు సుహాసిని చూసి..

మణిరత్నం ఒత్తిడితో ‘కాదల్’ మూవీతో హీరోయిన్ అయ్యింది. దీన్ని ‘కడలి’ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. కానీ రెండు భాషల్లోనూ ఇంప్రెస్ చేయలేకపోయింది. తర్వాత 2014లో యాన్ అనే మరో తమిళ సినిమాలో హీరోయిన్ గా చేసింది. దీన్ని ‘రంగం 2’ పేరు తెలుగులో రిలీజ్ చేశారు. కానీ అస్సలు కలిసి రాలేదు. దీంతో పూర్తిగా ఇండస్ట్రీకే దూరమైపోయింది.

రీసెంట్‌గా అక్క కార్తీక పెళ్లిలో తులసి కనిపించింది. అయినా.. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాగా ఊరిపోయింది. దీంతో ఈమెని ఎవ‌రూ గుర్తుపట్టలేకపోయారు. ప్ర‌స్తుతం ఆమె (Thulasi Nair) వైద్య చికిత్స కోసం అమెరికాలో ఉంద‌ని స‌మాచారం. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus