Vijay Devarakonda: యంగ్ హీరోయిన్ కి విజయ్ ఛాన్స్ ఇస్తాడా..?

  • May 19, 2022 / 04:36 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పేటా’, విజయ్ నటించిన ‘మాస్టర్’ చిత్రాల్లో కనిపించి మంచి గుర్తింపును సంపాదించుకుంది నటి మాళవిక మోహనన్. ఆ తరువాత ధనుష్ తో ‘మారన్’ సినిమా చేసింది. ఇది పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ప్రస్తుతం తమిళంలోనే కాకుండా హిందీలో కూడా ఓ సినిమా చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ తన అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించింది. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.

టాలీవుడ్ లో సినిమా ఎప్పుడు ఉంటుందని అడగ్గా.. ప్రస్తుతం ఓ సినిమా ఓకే చేశానని త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని చెప్పింది. అంతకుమించి వివరాలు చెప్పలేదు. ఓ నెటిజన్.. ‘తమిళ బిగ్ స్టార్స్ అయిన రజనీకాంత్, విజయ్‌లతో కలిసి నటించారు. ఇప్పడు ఎవరితో కలిసి నటించాలని ఎదురుచూస్తున్నారు?’ అని ప్రశ్నించాడు. దానికి మాళవిక.. ‘విజయ్ దేవరకొండతో కలిసి రొమాంటిక్ లేదా రోమ్ కోమ్ సినిమా చేయాలని ఉంది’ అంటూ తన కోరికను బయటపెట్టింది.

నిజానికి ఇదివరకే ఈమెకి విజయ్ దేవరకొండతో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ గతంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాను లాంచ్ చేశారు. ఇందులో మాళవికను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆనంద్ అన్నామలై దర్శకుడిగా పరిచయమవుతూ మొదలుపెట్టిన ఈ సినిమా ఆరంభంలోనే ఆగిపోయింది. ఆ విధంగా విజయ్ సినిమా ఛాన్స్ మిస్ అయింది. మరి ఫ్యూచర్ లో ఈ బ్యూటీకి రౌడీ హీరోతో రొమాన్స్ చేసే ఛాన్స్ వస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి విజయ్.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus