అగ్ర తారలతో నటిస్తున్న స్టార్‌ హీరో అల్లుడు

  • December 20, 2020 / 07:17 AM IST

భారతీయ నటులు హాలీవుడ్‌లో నటించడం అంటే మామూలు విషయం కాదు. అడపాదడపా హాలీవుడ్‌లో కనిపించడం తప్ప… ఒకటికి మించి హాలీవుడ్‌ సినిమాలు చేయడం అంటే ఆసక్తికరమైన అంశమే. ఒకవేళ హాలీవుడ్ అవకాశం వచ్చినా అందులో ముఖ్యంగా కథానాయికలు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులు మాత్రమే ఉంటారు. హీరోలు అందులోనూ దక్షిణాది హీరోలు హాలీవుడ్‌ చిత్రాల్లో కనిపించడం చాలా అరుదు. అలాంటి సువర్ణావకాశాన్ని దక్కించుకున్నాడు తమిళ స్టార్‌ ధనుష్‌. ‘అవెంజర్స్‌’ దర్శకులు రూసో బ్రదర్స్‌ రూపొందించనున్న ‘ది గ్రే మ్యాన్‌’లో ధనుష్‌ నటించబోతున్నాడు.

ఈ విషయాన్ని చిత్రబృందం ఇటీవల వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్‌ కోసం రూసో బ్రదర్స్‌ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. అందులో హాలీవుడ్‌ స్టార్స్‌ క్రిస్‌ ఎవాన్స్‌, ర్యాన్‌ గ్లోసింగ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. అలాంటి చిత్రంలో ధనుష్‌ కూడా నటించబోతున్నాడు. ‘‘మార్క్‌ గ్రీనీ రాసిన తొలి నవల ఆధారంగా భారీ ఎత్తున యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో చిత్రం రూపొందిస్తున్నాం. అందులో ధనుష్‌ను కూడా ఎంచుకున్నాం’’ అని దర్శకుల్లో ఒకరైన ఆంటోని రూసో అన్నారు.

ఈ సినిమా కోసం ధనుష్‌ 45 రోజులు కాల్‌షీట్స్‌ ఇచ్చాడట. ధనుష్‌ ఇప్పటికే ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’ అనే హాలీవుడ్‌ చిత్రం చేసిన విషయం తెలిసిందే.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus