సోషల్ మీడియా పెరిగిన తరువాత రోమర్లు అన్నీ సెలబ్రిటీల వద్దకు నేరుగా చేరుకుంటున్నాయి. ఈ విషయాల పై కొంతమంది స్పందిస్తారు.. మరికొందరు స్పందించరు. మన సౌత్ సంగతి పక్కన పెడితే.. బాలీవుడ్ లో ఓ రూమర్ పుట్టుకొచ్చింది అంటే అది చాలా దూరం వెళ్ళిపోతుంది. ఆ రూమర్ పై రక రకాల కథనాలు పుట్టుకొచ్చేస్తుంటాయి. ‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ తరువాత ‘వినయ విధేయ రామా’ చిత్రంలో కూడా నటించింది. ఈ భామ కొన్నాళ్ళుగా ప్రేమలో మునిగి తేలుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
వివరాల్లోకి వెళితే..యువ హీరో సిద్దార్థ్ మల్హోత్రా తో కైరా ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ విషయం పై తాజాగా సిద్దార్థ్ క్లారిటీ ఇచ్చాడు. “కైరాతో నాకు లవ్వా? అలాంటిదేమీ లేదు.. ఎలాంటి డేటింగ్ చేయడం లేదు. ఈ వార్తలు వినగానే షాకయ్యను. కైరా తో కలిసి ‘షేర్ షా’ అనే చిత్రంలో నటిస్తున్నాను. నాకు కైరా మంచి ఫ్రెండ్. దయచేసి అటువంటి రూమర్స్ ను ఎవ్వరూ నమ్మొద్దు” అంటూ చెప్పుకొచ్చాడు సిద్దార్థ్ మల్హోత్రా.