Mouli – Harsh Roshan: వన్ సినిమా వండర్స్ అయిపోతున్నారుగా.. అందుకే ఒక్క సినిమాకే లేపొద్దు
- November 17, 2026 / 08:41 AM ISTByFilmy Focus Desk
ఒక్క సినిమా విజయం సాధించగానే.. ‘టాలీవుడ్‌కి కొత్త హీరో వచ్చేశాడు’ అంటూ కొంతమంది ఔత్సాహిక భజనపరులు తెగ మోసేస్తుంటారు. ఎంతలా అంటే.. అప్పటివరకు స్టార్లు అనిపించుకున్న, ప్రామిసింగ్ నటులు అనిపించుకున్న వారంతా ఎందుకూ పనికిరారు అనేంతలా వీరిని లేపుతుంటారు. ఆ భజన చూసి ఆ నటులు కూడా ‘తమను మించినోళ్లు లేరు’ అని కాస్త యాటిట్యూడ్ చూపిస్తారు. కొందరైతే విక్టిమ్ కార్డు బయటకు తీస్తారు. ఇక్కడివరకు అంతా బాగుంది.
Mouli – Harsh Roshan
కానీ, ఆ హీరో కొత్త సినిమా ఫెయిలైతే.. మొత్తం పరిస్థితులు మారిపోతాయి. అప్పటివరకు తొలి సినిమా విజయం చూసి మెచ్చేసుకున్న ఎవరూ అప్పుడు మాట్లాడరు. రెండో సినిమా కదా.. కాస్త కంగారు పడినట్లున్నాడు, మరో మంచి సినిమా చేస్తాడులే అనే భరోసా కూడా ఇవ్వరు. ఇలాంటి పరిస్థితుల గురించి క్లియర్‌గా కావాలి అంటే.. రీసెంట్ టైమ్స్ బాగా ఎలివేట్ అయిన ఇద్దరి గురించి చెప్పుకోవాలి. వాళ్లే హర్ష్ రోషన్, మౌళి తనూజ్ ప్రశాంత్.

యస్, వాళ్లిద్దరే. తొలి సినిమాతో ప్రధాన పాత్రధారుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరూ ఆ తర్వాత చేసిన సినిమా(ల)తో సరైన ఫలితం అందుకోలేకపోయారు. ‘కోర్ట్’ సినిమాతో హర్ష్ రోషన్, ‘లిటిల్ హార్ట్స్’తో మౌళి మంచి విజయం అందుకున్నారు. వాళ్లు చేసిన ఆ సినిమాలేంటి, ఫలితాలేంటి అనే వివరాలు ఇక్కడ అప్రస్తుతం. కానీ ఎవరో ఇచ్చిన హైప్‌కి వీళ్ల కెరీర్‌లు ఇరకాటంలో పడుతున్నాయి అనేదే ఇక్కడ పాయింట్.
మొన్నామధ్య ఎవరో యాంకర్, ఇంకెవరితోనే ఏదో అన్నారని.. ఈ ఇద్దరిలో ఒక హీరో హర్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ యాంకర్ చెప్పిందే కొత్త సినిమాతో నిజమైంది. కాబట్టి ఒక్క సినిమాకే ఇలాంటి కుర్రాళ్లను ఆకాశానికి ఎత్తడం సరికాదు. వాళ్లు కూడా అలాంటి వాళ్లను ఎంటర్‌టైన్ చేయడం సరికాదు. చూద్దాం వీరిద్దరినీ చూసి ఇతర కుర్ర హీరోలు అయినా కాస్త కంట్రోల్ అవుతారేమో.











