Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌ రిలీజ్ చేసిన ‘ఉప్పెన’ ట్రైల‌ర్‌!

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌ రిలీజ్ చేసిన ‘ఉప్పెన’ ట్రైల‌ర్‌!

  • February 4, 2021 / 07:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌ రిలీజ్ చేసిన ‘ఉప్పెన’ ట్రైల‌ర్‌!

పంజా వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి జంట‌గా సుకుమార్ రైటింగ్స్ భాగ‌స్వామ్యంతో మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఉప్పెన‌’. బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఫిబ్ర‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో ఈ చిత్రం విడుద‌ల‌వుతోంది. గురువారం ఉప్పెన ట్రైల‌ర్‌ను యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న కార్యాల‌యంలో రిలీజ్ చేశారు. ట్రైల‌ర్ సూప‌ర్బ్‌గా ఉందంటూ ప్ర‌శంసించారు. సినిమా కూడా అంతే బాగా ఉంటుంద‌ని ఆశిస్తున్నాన‌నీ, త‌ప్ప‌కుండా ఈ సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని అనుకుంటున్నాన‌నీ ఆయ‌న అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో హీరోయిన్లు వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి, డైరెక్ట‌ర్ బుచ్చిబాబు, నిర్మాత‌ల్లో ఒక‌రైన వై. ర‌విశంక‌ర్ పాల్గొన్నారు.

డైరెక్ట‌ర్ బుచ్చిబాబు మాట్లాడుతూ, “నా ఫ‌స్ట్ ఫిల్మ్ ట్రైల‌ర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ‌వ‌డం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ క‌థ‌ను నేను మొద‌ట‌గా చెప్పింది ఆయ‌న‌కే. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు మ‌ధ్య మ‌ధ్య‌లో కాల్ చేసి ఎలా వ‌స్తోంద‌ని అడిగేవారు. క‌థ విని ఆయ‌న ఇచ్చిన స‌పోర్ట్‌, ఎన‌ర్జీతోటే చిరంజీవి గారికీ, విజ‌య్ సేతుప‌తి గారికీ, దేవి శ్రీ‌ప్ర‌సాద్ గారికీ ఈ స్టోరీని నెరేట్ చేసుకుంటూ వ‌చ్చాను. ‘ఉప్పెన’ తీశాను” అన్నారు. ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే, ఒక అంద‌మైన, అదే స‌మ‌యంలో ఉద్వేగ‌భ‌రిత‌మైన ప్రేమ‌క‌థ‌తో ఈ మూవీని డైరెక్ట‌ర్ బుచ్చిబాబు రూపొందించిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. హీరోయిన్‌ను చూసి, ఆమె అపురూప సౌంద‌ర్యానికి ప‌డిపోయిన హీరో త‌న ఫ్రెండ్‌తో, “అబ‌ద్ధాలాడితేనే ఆడ‌పిల్ల పుడ‌తారంటే, మ‌రీ ఇంత అంద‌గ‌త్తె పుట్టిందంటే మినిమ‌మ్ ఈళ్ల బాబు మ‌ర్డ‌రేమ‌న్నా చేసుంటాడేమిట్రా!” అని య‌థాలాపంగా అంటాడు. నిజానికి ఆమె తండ్రి అలాంటివాడేన‌ని ఆ త‌ర్వాత షాట్ల‌లో మ‌న‌కు క‌నిపిస్తుంది.

ఆ తండ్రిగా విజ‌య్ సేతుప‌తి న‌టించారు. ప‌రువు కోసం ఎంత‌టి క్రూర‌త్వానికైనా తెగ‌బ‌డే మ‌న‌స్త‌త్వం ఆయ‌న‌ద‌ని ట్రైల‌ర్ మ‌న‌కు చూపిస్తుంది. త‌న కూతుర్ని ఓ పేదింటి కుర్రాడు ప్రేమిస్తే ఆయ‌న చేతులు ముడుచుకొని కూర్చుంటాడా? త‌న కూతురు ఆ కుర్రాడితో క‌లిసి ఆనందంగా ఆడుతూపాడుతూ ఉండ‌టం క‌ళ్లారా చూసిన ఆయ‌న ఏం చేశాడు? వారి ప్రేమ‌ను తెంచేయ‌డానికి ఎంత‌టి ఘోరానికి పాల్ప‌డ్డాడు? త‌మ ప్రేమ‌ను ఆ యువ‌జంట కాపాడుకుందా? అనేది ఆస‌క్తికరం. హీరోయిన్ త‌న తండ్రితో, “ప్రేమంటే ప‌ట్టుకోవ‌డం నాన్నా.. వ‌దిలెయ్య‌డం కాదు” అన‌డం చూస్తే, హీరోతో ప్రేమ‌ను వ‌దిలెయ్య‌మ‌ని ఆమెకి వార్నింగ్ ఇచ్చాడ‌నీ, అప్పుడామె ఆ మాట‌లు అన్న‌ద‌నీ అనిపిస్తుంది.

హీరో హీరోయిన్ల ప్రేమ స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు ఒక అంద‌మైన పెయింటింగ్ లాగా చిత్రీక‌రించార‌నేది స్ప‌ష్టం. మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించే పాట‌లతో, థ్రిల్లింగ్ షాట్స్‌తో, అంతే ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో, సూప‌ర్బ్ అనిపించే విజువ‌ల్స్‌తో ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది. దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చ‌గా ఇప్ప‌టికే విడుద‌లైన “నీ క‌న్ను నీలి స‌ముద్రం”, “ధ‌క్ ధ‌క్‌”, “రంగుల‌ద్దుకున్న”, “జ‌ల జ‌ల జ‌ల‌పాతం నువ్వు” పాట‌లు సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రిస్తున్నాయి.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu
  • #devi sri prasad
  • #Kirti Shetty
  • #Mythri Movie Makers
  • #Panja Vaishnav Tej

Also Read

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

Rao Bahadur: ‘రావు బహదూర్’ ట్రైలర్ రివ్యూ.. ‘మేజిక్ కి న్యూ డెఫినిషన్’ చెప్పిన మహేష్ బాబు

related news

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

Buchi Babu: ప్రతి పెళ్లిలో అలాంటోడు ఒకడుంటాడు.. వాడి కోసం ఆలోచిస్తే ఎలా?

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

trending news

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

10 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

12 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

13 hours ago
Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

Vishal: ‘పందెంకోడి’ సినిమాని బలవంతంగా తెలుగులో రిలీజ్ చేయించారు.. ‘మకుటం’తో దర్శకుడిగా కూడా మారాను : విశాల్

15 hours ago
Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

Akhil Raj: నన్ను ఇంతలా తిడుతున్నారు.. మీ అమ్మని అంటే మీరు ఊరుకుంటారా?

1 day ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

12 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

13 hours ago
Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

14 hours ago
Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

15 hours ago
Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రివ్యూ.. ‘యుద్దం కూడా ప్రశాంతంగా చేయాలి’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version