Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » ఈ 10 మైనస్ లు లేకపోతే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’కి హిట్ టాక్ పక్కా..!

ఈ 10 మైనస్ లు లేకపోతే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’కి హిట్ టాక్ పక్కా..!

  • November 25, 2022 / 10:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ 10 మైనస్ లు లేకపోతే  ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’కి హిట్ టాక్  పక్కా..!

కామెడీ సినిమాలతో స్టార్ గా ఎదిగాడు ఇవివి సత్యనారాయణ గారి చిన్నబ్బాయి అల్లరి నరేష్. మొదటి సినిమాతో హిట్ కొట్టి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. మొన్నామధ్య నరేష్ కు వరుస ప్లాపులు ఎదురయ్యాయి. దీంతో మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ మూవీలో నటించి మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. అటు తర్వాత చేసిన ‘బంగారు బుల్లోడు’ నిరాశపరిచినా.. ‘నాంది’ మూవీతో తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టి సూపర్ హిట్ అందుకున్నాడు. ‘నాంది’ తర్వాత అల్లరి నరేష్ చేసిన మరో సీరియస్ సబ్జెక్ట్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ఏఆర్ మోహన్ ఈ చిత్రానికి దర్శకుడు. హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 25న అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ నమోదైంది. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవే మైనస్సులుగా మారాయి. అవేంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :

1) ‘నాంది’ లానే ఇది కూడా సీరియస్ సబ్జెక్ట్. అలా అని కథేమీ కొత్తది కాదు.ఓ అడవి… ఆ అడవే సర్వస్వం అనుకునే గిరిజనులు… వారి సమస్యలు. అడవి కి దగ్గర్లో సరైన హాస్పిటల్ ఉండదు, ప్రమాదం వచ్చినప్పుడు హాస్పిటల్ కు వెళ్లాలన్నా.. వాగులు వంటివి వంటివి దాటాలి. అన్నీ దాటుకుని హాస్పిటల్ కు వెళ్లినా ప్రాణాలు నిలబడతాయన్న గ్యారెంటీ లేదు. గర్భిణీ స్త్రీలకు అత్యవసరమైన చికిత్స అందాలన్నా దొరకదు. అడవిని దాటుకుని చదువు కోవాలి అనుకునే యువత కూడా ఆశలు చంపుకుని బ్రతకాల్సిందే. నిత్యం ఇలాంటి సమస్యలు మనం పేపర్లలో, వార్తల్లో చూస్తున్నాం. కథ చాలా వరకు 2017 లో వచ్చిన హిందీ సినిమా న్యూటన్ కు దగ్గర పోలికలు ఉంటాయి. అలాగే తెలుగులో రవితేజ నటించిన ‘భగీరథ’ పాయింట్ ను కూడా టచ్ చేశాడు దర్శకుడు. కాబట్టి కథలో కొత్తదనం ఏమీ ఉండదు.

2) ఇటీవల వచ్చిన సినిమాల్లో కథ ఉండాలి అనే రూల్ లేదు. కథనం బాగుండాలి .. రెండున్నర గంటలు థియేటర్లలో కూర్చుని చూడగలగాలి.

3) ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ లో అది కూడా మిస్ అయ్యింది. కథనం స్లోగా సాగుతుంది. అన్నీ ముందుగానే తెలిసిపోతాయి.

4) ఫస్ట్ హాఫ్ చాలా బోర్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఇంటర్వెల్ కు ముందు వచ్చే సన్నివేశం… దాని వెనుక ఉన్న సస్పెన్స్ కూడా ఈజీగా గెస్ చేసే విధంగా ఉంటుంది.

5)సెకండ్ హాఫ్ బాగానే ఉంది అని సరిపెట్టుకునేసరికి… మళ్ళీ క్లైమాక్స్ సాగదీశాడు దర్శకుడు. దీంతో ఆడియన్స్ కు పరీక్ష గా మారింది.

6) ఆనంది పాత్ర హీరోయిన్ కు తక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఎక్కువ అన్నట్టు ఉంది. ఆమె మంచి నటే కానీ పాత్రలో బలం లేదు.

7) శ్రీచరణ్ పాకాల సంగీతంలో రూపొందిన పాటలు బాగానే ఉన్నాయి కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నిరాశపరిచాడు.

8) కమెడియన్లలో ప్రవీణ్ పాత్ర ఎలా ఉన్నా.. వెన్నెల కిషోర్ కామెడీ రిపీటెడ్ గా అనిపిస్తుంది. రఘుబాబు కొంతలో కొంత పర్వాలేదు.

9) అల్లరి నరేష్ ను అతి మంచోడుగా చూపించడం వల్ల.. అతని నుండి ఆశించే మినిమమ్ కామెడీ కూడా మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.

10) అబ్బూరి రవి సంభాషణలు బాగున్నాయి. కానీ అవి అల్లరి నరేష్ ఇమేజ్ కు మ్యాచ్ అయ్యేవిగా లేవు. ముఖ్యంగా ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్ .. ‘నువ్వు తెలుగు మాస్టర్ అయ్యుండి.. క్లాస్ బయట ‘డోంట్ డిస్టర్బ్’ అనే ఇంగ్లీష్ పదాలతో బోర్డు ఎందుకు పెట్టుకున్నావ్’ అని అడిగితే నరేష్ చెప్పే డైలాగులు ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇలాంటి సందర్భాలు సినిమాలో చాలానే ఉన్నాయి అని చెప్పాలి.

ఇలాంటి మైనస్ ల విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేది అని చెప్పొచ్చు.ఇప్పటికైతే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఓ యావరేజ్ మూవీగా మిగిలిపోతుంది అని చెప్పాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Anandhi
  • #AR Mohan
  • #Itlu Maredumilli Prajaneekam
  • #Praveen

Also Read

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

related news

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

trending news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

9 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

11 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

15 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

16 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

16 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

16 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

16 hours ago
Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

17 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

17 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version