ఈ 10 మైనస్ లు లేకపోతే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’కి హిట్ టాక్ పక్కా..!

కామెడీ సినిమాలతో స్టార్ గా ఎదిగాడు ఇవివి సత్యనారాయణ గారి చిన్నబ్బాయి అల్లరి నరేష్. మొదటి సినిమాతో హిట్ కొట్టి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు. మొన్నామధ్య నరేష్ కు వరుస ప్లాపులు ఎదురయ్యాయి. దీంతో మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ మూవీలో నటించి మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. అటు తర్వాత చేసిన ‘బంగారు బుల్లోడు’ నిరాశపరిచినా.. ‘నాంది’ మూవీతో తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టి సూపర్ హిట్ అందుకున్నాడు. ‘నాంది’ తర్వాత అల్లరి నరేష్ చేసిన మరో సీరియస్ సబ్జెక్ట్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ఏఆర్ మోహన్ ఈ చిత్రానికి దర్శకుడు. హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 25న అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ నమోదైంది. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవే మైనస్సులుగా మారాయి. అవేంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :

1) ‘నాంది’ లానే ఇది కూడా సీరియస్ సబ్జెక్ట్. అలా అని కథేమీ కొత్తది కాదు.ఓ అడవి… ఆ అడవే సర్వస్వం అనుకునే గిరిజనులు… వారి సమస్యలు. అడవి కి దగ్గర్లో సరైన హాస్పిటల్ ఉండదు, ప్రమాదం వచ్చినప్పుడు హాస్పిటల్ కు వెళ్లాలన్నా.. వాగులు వంటివి వంటివి దాటాలి. అన్నీ దాటుకుని హాస్పిటల్ కు వెళ్లినా ప్రాణాలు నిలబడతాయన్న గ్యారెంటీ లేదు. గర్భిణీ స్త్రీలకు అత్యవసరమైన చికిత్స అందాలన్నా దొరకదు. అడవిని దాటుకుని చదువు కోవాలి అనుకునే యువత కూడా ఆశలు చంపుకుని బ్రతకాల్సిందే. నిత్యం ఇలాంటి సమస్యలు మనం పేపర్లలో, వార్తల్లో చూస్తున్నాం. కథ చాలా వరకు 2017 లో వచ్చిన హిందీ సినిమా న్యూటన్ కు దగ్గర పోలికలు ఉంటాయి. అలాగే తెలుగులో రవితేజ నటించిన ‘భగీరథ’ పాయింట్ ను కూడా టచ్ చేశాడు దర్శకుడు. కాబట్టి కథలో కొత్తదనం ఏమీ ఉండదు.

2) ఇటీవల వచ్చిన సినిమాల్లో కథ ఉండాలి అనే రూల్ లేదు. కథనం బాగుండాలి .. రెండున్నర గంటలు థియేటర్లలో కూర్చుని చూడగలగాలి.

3) ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ లో అది కూడా మిస్ అయ్యింది. కథనం స్లోగా సాగుతుంది. అన్నీ ముందుగానే తెలిసిపోతాయి.

4) ఫస్ట్ హాఫ్ చాలా బోర్ ఫీలింగ్ కలిగిస్తుంది. ఇంటర్వెల్ కు ముందు వచ్చే సన్నివేశం… దాని వెనుక ఉన్న సస్పెన్స్ కూడా ఈజీగా గెస్ చేసే విధంగా ఉంటుంది.

5)సెకండ్ హాఫ్ బాగానే ఉంది అని సరిపెట్టుకునేసరికి… మళ్ళీ క్లైమాక్స్ సాగదీశాడు దర్శకుడు. దీంతో ఆడియన్స్ కు పరీక్ష గా మారింది.

6) ఆనంది పాత్ర హీరోయిన్ కు తక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఎక్కువ అన్నట్టు ఉంది. ఆమె మంచి నటే కానీ పాత్రలో బలం లేదు.

7) శ్రీచరణ్ పాకాల సంగీతంలో రూపొందిన పాటలు బాగానే ఉన్నాయి కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నిరాశపరిచాడు.

8) కమెడియన్లలో ప్రవీణ్ పాత్ర ఎలా ఉన్నా.. వెన్నెల కిషోర్ కామెడీ రిపీటెడ్ గా అనిపిస్తుంది. రఘుబాబు కొంతలో కొంత పర్వాలేదు.

9) అల్లరి నరేష్ ను అతి మంచోడుగా చూపించడం వల్ల.. అతని నుండి ఆశించే మినిమమ్ కామెడీ కూడా మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.

10) అబ్బూరి రవి సంభాషణలు బాగున్నాయి. కానీ అవి అల్లరి నరేష్ ఇమేజ్ కు మ్యాచ్ అయ్యేవిగా లేవు. ముఖ్యంగా ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్ .. ‘నువ్వు తెలుగు మాస్టర్ అయ్యుండి.. క్లాస్ బయట ‘డోంట్ డిస్టర్బ్’ అనే ఇంగ్లీష్ పదాలతో బోర్డు ఎందుకు పెట్టుకున్నావ్’ అని అడిగితే నరేష్ చెప్పే డైలాగులు ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇలాంటి సందర్భాలు సినిమాలో చాలానే ఉన్నాయి అని చెప్పాలి.

ఇలాంటి మైనస్ ల విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేది అని చెప్పొచ్చు.ఇప్పటికైతే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఓ యావరేజ్ మూవీగా మిగిలిపోతుంది అని చెప్పాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus