Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఖైదీ నంబర్ 150 లో ఆకర్షిస్తున్న అంశాలు

ఖైదీ నంబర్ 150 లో ఆకర్షిస్తున్న అంశాలు

  • January 10, 2017 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఖైదీ నంబర్ 150 లో ఆకర్షిస్తున్న అంశాలు

బాస్ ఈజ్ బ్యాక్.. మెగా ఫ్యాన్స్ నోట కొన్ని రోజులుగా పలుకుతున్న మాట ఇది. డ్యాన్స్, ఫైట్స్ తో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ కాలం తరవాత రేపు థియేటర్లోకి రాబోతున్నారు. ఆయన హీరోగా నటించిన ఖైదీ నంబర్ 150 మూవీ బుధవారం రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామని అందరూ ఎదురుచూస్తున్నారు. అంతలా ఎదురుచూడ్డానికి గల కారణాలేమిటో తెలుసుకుందాం.

1 . చిరంజీవిKhaidi No 150అవును. ఖైదీ నంబర్ 150 చూడాలనుకోవడానికి మొదటి కారణం చిరంజీవి. 9 ఏళ్ల తర్వాత సినిమాల్లో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. అంతే కాదు ఇందులో చిరు డ్యూల్ రోల్ తో చేస్తున్నారు. ఠాగూర్ చిత్రంలో మాదిరిగా శంకర్ అనే ఓ సీరియస్ పాత్ర చేస్తూనే .. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలోలాగా సరదా పాత్రలో నటిస్తున్నారు. ఇలా మాస్, క్లాస్ క్యారెక్టర్స్ లో అలరించనున్నారు. సో మెగా ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా అన్నమాట.

2 . కథKhaidi No 150తమిళంలో కమర్షియల్ డైరక్టర్ ఏ ఆర్ మురుగ దాస్ తెరకెక్కిన కత్తి సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేశారు. రైతుల కోసం ప్రాణాలకు తెగించి పోరాడే ఇద్దరి కథ ఇది. విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ వందకోట్లకు పైగా కలక్షన్స్ వసూల్ చేసింది. ఆ కథకు తెలుగు నేటివిటీకి జోడించి తీశారు. ఈ స్టోరీ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

3 . డైరక్టర్Khaidi No 150యాక్షన్ సినిమాల డైరక్టర్ వివి వినాయక్ చిరంజీవికి వీరాభిమాని. ఒక అభిమాని చిరుని ఎలా చూడాలనుకుంటారో అలాగే డైరక్ట్ చేస్తారు. అలాగే మెగాస్టార్ తో ఠాగూర్ తీసి విజయం అందుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఖైదీ నంబర్ 150 ని తెరకెక్కించారు. సో వినాయక్ డైరక్షన్ పై భారీ అంచనాలున్నాయి.

4 . కాజల్ తో కెమిస్ట్రీKhaidi No 150టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ తన నటనతో అనేకమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమె తొలిసారి చిరు సరసన నటిస్తోంది. వీరిద్దరి మధ్య ఉండే లవ్ సీన్స్ మంచి అనుభూతిని ఇవ్వనుంది.

5 . రత్నవేలుKhaidi No 150రోబో చిత్రానికి కెమెరా మెన్ గా చేసిన రత్నవేలు ఖైదీ నంబర్ 150 కి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. చిరంజీవిని అందంగా చూపించడమే కాదు.. ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్ లా తీర్చి దిద్దారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లో అతని కెమెరా పనితనం స్పష్టంగా తెలుస్తోంది.

6 . పాటలుKhaidi No 150మున్నాభాయ్ ఎమ్ బీ ఎస్ ఎస్, అందరివాడు, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. నాలుగో చిత్రం ఖైదీ నంబర్ 150 కి కూడా మంచి ఆల్బమ్ ని ఇచ్చారు. పాటలు అన్ని సూపర్ హిట్. దీనిని తెరపైన చూడాలని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.

7 . ఫైట్లుKhaidi No 150గ్యాగం లీడర్, కొదమ సింహం చిత్రానికి ఫైటర్స్ గా పనిచేసిన రామ్ లక్ష్మన్ లు ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా పనిచేశారు. బాస్ కోసం కొత్త విధానంలో ఫైట్స్ కంపోజ్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ ఫైట్ కొరియోగ్రాఫర్స్ గా పేరుతెచ్చుకున్న వీరు మాస్ అభిమానులు మెచ్చేలా యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారు.

8 . డైలాగ్స్Khaidi No 150ఖైదీ, గ్యాంగ్ లీడర్, ముఠా మేస్ర్తి, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీఎస్, స్టాలిన్ చిత్రాల్లో చిరంజీవి కోసం పరుచూరి బ్రదర్స్ పవర్ ఫుల్ డైలాగ్స్ రాసారు. ఖైదీ నంబర్ 150 లో కూడా తమ పెన్ పవర్ చూపించనున్నారు. “ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా .. నచ్చితేనే చూస్తా.. కాదని బలవంతం చేస్తే కోస్తా ” అంటూ టీజర్ లో చిరు తో చెప్పించి ఇంద్రను గుర్తుకు తెచ్చారు. ట్రైలర్ లో “పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటది.. వెయిటింగ్” అని పలికించి మరిన్ని డైలాగులకోసం అందర్నీ ఎదురుచూసేలా చేశారు.

9 . ప్రీ క్లైమాక్స్Khaidi No 150ఈ చిత్రంలో ఎన్నో హైలెట్ సీన్లు ఉన్నాయి. అయితే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే మీడియా సీన్ మాత్రం సూపర్ గా వచ్చిందని చిత్ర బృందం చెప్పింది. ఠాగూర్ లో కోర్టు సీన్ మాదిరిగా ఈ సీన్ ఆకట్టుకుంటుందని వెల్లడించింది.

10 . మెగా హీరోస్ ఎంట్రీKhaidi No 150ఖైదీ నంబర్ 150 లో చిరు తో పాటు ఇద్దరు మెగా హీరోలు సందడి చేయనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 30 సెకన్ల పాటు డ్యాన్స్ చేయనున్నారు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెరుపు పాత్రలో ఎంట్రీ ఇవ్వనున్నారు. మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా ఓ సన్నివేశంలో కనిపించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun In Khaidi No 150 Movie
  • #Chiranjeevi 150 Film
  • #Chiranjeevi and Ram Charan
  • #Chiranjeevi Dialogues
  • #devi sri prasad

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

21 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

17 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

18 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

19 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

20 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version