బాస్ ఈజ్ బ్యాక్.. మెగా ఫ్యాన్స్ నోట కొన్ని రోజులుగా పలుకుతున్న మాట ఇది. డ్యాన్స్, ఫైట్స్ తో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ కాలం తరవాత రేపు థియేటర్లోకి రాబోతున్నారు. ఆయన హీరోగా నటించిన ఖైదీ నంబర్ 150 మూవీ బుధవారం రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామని అందరూ ఎదురుచూస్తున్నారు. అంతలా ఎదురుచూడ్డానికి గల కారణాలేమిటో తెలుసుకుందాం.
1 . చిరంజీవిఅవును. ఖైదీ నంబర్ 150 చూడాలనుకోవడానికి మొదటి కారణం చిరంజీవి. 9 ఏళ్ల తర్వాత సినిమాల్లో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. అంతే కాదు ఇందులో చిరు డ్యూల్ రోల్ తో చేస్తున్నారు. ఠాగూర్ చిత్రంలో మాదిరిగా శంకర్ అనే ఓ సీరియస్ పాత్ర చేస్తూనే .. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలోలాగా సరదా పాత్రలో నటిస్తున్నారు. ఇలా మాస్, క్లాస్ క్యారెక్టర్స్ లో అలరించనున్నారు. సో మెగా ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా అన్నమాట.
2 . కథతమిళంలో కమర్షియల్ డైరక్టర్ ఏ ఆర్ మురుగ దాస్ తెరకెక్కిన కత్తి సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేశారు. రైతుల కోసం ప్రాణాలకు తెగించి పోరాడే ఇద్దరి కథ ఇది. విజయ్ హీరోగా నటించిన ఈ మూవీ వందకోట్లకు పైగా కలక్షన్స్ వసూల్ చేసింది. ఆ కథకు తెలుగు నేటివిటీకి జోడించి తీశారు. ఈ స్టోరీ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
3 . డైరక్టర్యాక్షన్ సినిమాల డైరక్టర్ వివి వినాయక్ చిరంజీవికి వీరాభిమాని. ఒక అభిమాని చిరుని ఎలా చూడాలనుకుంటారో అలాగే డైరక్ట్ చేస్తారు. అలాగే మెగాస్టార్ తో ఠాగూర్ తీసి విజయం అందుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఖైదీ నంబర్ 150 ని తెరకెక్కించారు. సో వినాయక్ డైరక్షన్ పై భారీ అంచనాలున్నాయి.
4 . కాజల్ తో కెమిస్ట్రీటాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల్ తన నటనతో అనేకమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమె తొలిసారి చిరు సరసన నటిస్తోంది. వీరిద్దరి మధ్య ఉండే లవ్ సీన్స్ మంచి అనుభూతిని ఇవ్వనుంది.
5 . రత్నవేలురోబో చిత్రానికి కెమెరా మెన్ గా చేసిన రత్నవేలు ఖైదీ నంబర్ 150 కి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. చిరంజీవిని అందంగా చూపించడమే కాదు.. ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్ లా తీర్చి దిద్దారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లో అతని కెమెరా పనితనం స్పష్టంగా తెలుస్తోంది.
6 . పాటలుమున్నాభాయ్ ఎమ్ బీ ఎస్ ఎస్, అందరివాడు, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. నాలుగో చిత్రం ఖైదీ నంబర్ 150 కి కూడా మంచి ఆల్బమ్ ని ఇచ్చారు. పాటలు అన్ని సూపర్ హిట్. దీనిని తెరపైన చూడాలని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.
7 . ఫైట్లుగ్యాగం లీడర్, కొదమ సింహం చిత్రానికి ఫైటర్స్ గా పనిచేసిన రామ్ లక్ష్మన్ లు ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా పనిచేశారు. బాస్ కోసం కొత్త విధానంలో ఫైట్స్ కంపోజ్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ ఫైట్ కొరియోగ్రాఫర్స్ గా పేరుతెచ్చుకున్న వీరు మాస్ అభిమానులు మెచ్చేలా యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారు.
8 . డైలాగ్స్ఖైదీ, గ్యాంగ్ లీడర్, ముఠా మేస్ర్తి, ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా ఎంబీఎస్, స్టాలిన్ చిత్రాల్లో చిరంజీవి కోసం పరుచూరి బ్రదర్స్ పవర్ ఫుల్ డైలాగ్స్ రాసారు. ఖైదీ నంబర్ 150 లో కూడా తమ పెన్ పవర్ చూపించనున్నారు. “ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా .. నచ్చితేనే చూస్తా.. కాదని బలవంతం చేస్తే కోస్తా ” అంటూ టీజర్ లో చిరు తో చెప్పించి ఇంద్రను గుర్తుకు తెచ్చారు. ట్రైలర్ లో “పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటది.. వెయిటింగ్” అని పలికించి మరిన్ని డైలాగులకోసం అందర్నీ ఎదురుచూసేలా చేశారు.
9 . ప్రీ క్లైమాక్స్ఈ చిత్రంలో ఎన్నో హైలెట్ సీన్లు ఉన్నాయి. అయితే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే మీడియా సీన్ మాత్రం సూపర్ గా వచ్చిందని చిత్ర బృందం చెప్పింది. ఠాగూర్ లో కోర్టు సీన్ మాదిరిగా ఈ సీన్ ఆకట్టుకుంటుందని వెల్లడించింది.
10 . మెగా హీరోస్ ఎంట్రీఖైదీ నంబర్ 150 లో చిరు తో పాటు ఇద్దరు మెగా హీరోలు సందడి చేయనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 30 సెకన్ల పాటు డ్యాన్స్ చేయనున్నారు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెరుపు పాత్రలో ఎంట్రీ ఇవ్వనున్నారు. మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా ఓ సన్నివేశంలో కనిపించనున్నారు.