Rathika Rose: ‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ రతిక రోజ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

  • September 21, 2023 / 09:00 AM IST

బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమై 2 వారాలు పూర్తి కావస్తోంది. ఆల్రెడీ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆమె ఎవ్వరితోనూ కలవకుండా ఉండటం వల్ల.. నామినేషన్ నుండి, ఎలిమినేషన్ నుండి తప్పించుకోలేకపోయినట్టు అంతా అనుకుంటున్నారు. అయితే ఆమె ఎలిమినేషన్ తో మిగిలిన కంటెస్టెంట్లు అలర్ట్ అయ్యారు. సైలెంట్ గా గేమ్ ఆడటం మొదలుపెట్టారు. ఆ లిస్ట్ లో రతిక రోజ్ కూడా ఉంది. ఈమె హౌస్ లోకి 10 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.చూడడానికి ఈమె చాలా అందంగా ఉంది.

సోషల్ మీడియాలో ఈమె గురించి ఎక్కువ సెర్చింగ్ లు జరుగుతున్నాయి. స్టేజి పై హోస్ట్ నాగార్జునతో ఈమె చాలా రోజుల నుండి పరిచయం ఉన్నట్టే మాట్లాడింది. స్టేజ్ మీదికి రతిక అలా వచ్చిందో లేదో ఆ వెంటనే.. నాగార్జున.. “‘నీ హార్ట్ ఎలా ఉంది ఇప్పుడు’ అని అడిగాడు. అందుకు ఆమె చాలా నార్మల్‌గా ఉందని చెప్పింది. తర్వాత నాగార్జున ‘‘హార్ట్ బ్రేక్ నుండి బయట పడ్డావా?’ అంటే.. ‘హా..’ అంటూ రతిక నవ్వుకుంది. తర్వాత.. ‘చేసిందంతా చేసి ఎంత బాగా నవ్వుతూ అడుగున్నారో’ అంటూ నాగార్జునని రతిక అంది.

మధ్యలో నేనేం చేశానమ్మా? అని నాగార్జున అంటే.. ‘మొత్తం మీరే చేశారు.. చేసిందంతా చేసేసి.. ఎంచక్కా ఏమీ తెలియనట్టు హార్ట్ బ్రేక్ అయ్యింది కదా ఎలా ఉందని అడుగుతున్నారు? అంటూ రతిక చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈమె గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) రతిక రోజ్ బర్త్ డేట్ మే 12 . ఏ సంవత్సరం అనేది క్లారిటీ లేదు. అయితే ఈమె పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్లోనే అని తెలుస్తుంది.

2) మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఈమె బి.టెక్ కంప్లీట్ చేసింది.

3) 2016 లో ప్రారంభమైన ‘పటాస్’ షోతో ఈమె స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. ఆ షో వల్ల ఈమెకు అంతగా కలిసొచ్చింది అంటూ ఏమీ లేదు.

4) ఈమె ఓ మోడల్ కూడా. స్మాల్ స్క్రీన్ కి ఎంటర్ అవ్వకముందు ఈమె.. పలు యాడ్స్ లో కూడా నటించింది.

5) 2021 లో వచ్చిన ‘బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది’ అనే సినిమాతో నటిగా మారింది. అందులో ఈమె సహాయ నటి పాత్రని పోషించింది.

6) అటు తర్వాత రతిక.. వెంకటేష్ నటించిన ‘నారప్ప’ , విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ వంటి సినిమాల్లో నటించింది.

7) ఈ ఏడాది బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా వచ్చిన ‘నేను స్టూడెంట్ సార్’ సినిమాలో ఈమె పోలీస్ పాత్రలో కనిపించింది. ఆ పాత్రలో సిగరెట్లు కాలుస్తూ.. చాలా బోల్డ్ గా కనిపించింది.

8) ఈమెకు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. అలాగే కొంతమంది ప్రముఖులను ఇమిటేట్ చేయడంలో కూడా ఈమె సిద్ధహస్తురాలు.

9) ఈమె సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపింది అనే చర్చ గట్టిగా నడిచింది. కొన్నాళ్ళకి అతనితో బ్రేకప్ అవ్వడం కూడా జరిగిందట.

10) సినిమాలతో ద్వారా ఈమె పెద్దగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది అంటూ ఈమె లేదు. అందుకే ‘బిగ్ బాస్ 7 ‘ ను ఆశ్రయించింది. మరి ఇదెంత వరకు ఆమెకు కలిసొస్తుందో చూడాలి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus