‘టెంపర్’ ‘నాన్నకు ప్రేమతో’ సక్సెస్..లతో ఫాంలోకి వచ్చిన ఎన్టీఆర్, ‘మిర్చి’ ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్స్ తో సూపర్ ఫాంలో ఉన్న దర్శకుడు కొరటాల శివ. వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘జనతా గ్యారేజ్'(Janatha Garage). మలయాల స్టార్ హీరో మోహన్ లాల్ ఈ చిత్రంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. సమంత, నిత్యా మేనన్ హీరోయిన్లు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించిన 2వ సినిమా.ఇవి సరిపోవా.. ‘జనతా గ్యారేజ్’ చిత్రంపై అంచనాలు పెంచడానికి..! సరిగ్గా అదే జరిగింది.
రిలీజ్ కి ముందు ‘జనతా గ్యారేజ్’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మొదటి రోజు ఈ సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం వెంకడుగు వేయలేదు. ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఈ సెప్టెంబర్ 1తో ‘జనతా గ్యారేజ్’ రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న నేపధ్యంలో.. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 18.95 cr |
| సీడెడ్ | 11.70 cr |
| ఉత్తరాంధ్ర | 7.41 cr |
| ఈస్ట్ | 4.70 cr |
| వెస్ట్ | 4.05 cr |
| గుంటూరు | 5.75 cr |
| కృష్ణా | 4.41 cr |
| నెల్లూరు | 2.32 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 59.29 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 11.71 cr |
| ఓవర్సీస్ | 7.21 cr |
| మలయాళం | 1.84 cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 80.05 cr |
‘జనతా గ్యారేజ్’ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.68 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.80.05 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు రూ.12.81 కోట్ల లాభాలు అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.