జయ శివ సూర్య , నిఖిత శ్రీ, ఇషామనోహరి ప్రియ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం ‘100 డేస్ లవ్ స్టోరీ'(100 Days Love Story). ‘అతి ప్రేమ భయానకం’ అనేది క్యాప్షన్. ‘శ్రీ సాయి శివ ప్రియ క్రియేషన్స్’ సంస్థపై పురిపండా వెంకటరమణ మూర్తి శర్మ నిర్మించిన ఈ చిత్రాన్ని విజయమిత్ర దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రేమ కథలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అయితే అందులోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ, యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా వాటిని ప్రెజెంట్ చేయగలిగితే క్లాసిక్స్ గా నిలిచిపోతాయి అనడంలో కూడా సందేహం లేదు.
అలాంటి సినిమానే ‘100 డేస్ లవ్ స్టోరీ’ అని చిత్ర బృందం ధీమాగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ డేట్ ని టీం ఖరారు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ… ” కచ్చితంగా మా సినిమా ప్రేమ కథా చిత్రాల్లో ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తుంది అని నమ్ముతున్నాము. దర్శకుడు విజయమిత్ర కథను డీల్ చేసిన విధానం, హీరో హీరోయిన్ల నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఫిబ్రవరి 27న మా ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆదరిస్తారని భావిస్తున్నాను” అంటూ తెలిపారు.