ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’(Mana ShankaraVaraprasad Garu) సినిమా ఏ రేంజ్లో బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి రీజనల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఫిబ్రవరి 11 నుండి జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.ఇదిలా ఉంటే.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవి ఓ సీరియల్ లవర్ గా కూడా కనిపిస్తారు.
సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఓ సీరియల్ ని చూస్తూ ఆయనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ను బయటపెడుతూ కామెడీ చేస్తుంటారు. ఆ సీరియల్లో సౌమ్య పాత్రతో చిరు ఎక్కువగా ట్రావెల్ అవుతూ ఉంటారు.ఆ సీరియల్‌లోని పాత్రల గురించి చిరు అందరికీ చెబుతూ.. తన జీవితానికి రిప్లెక్ట్ అయినట్టు భవిస్తూ ఉంటారు చిరు. అయితే ఆ సీరియల్‌లో కనిపించిన నటి ఎవరా అని చాలా మంది ఆరా తీస్తున్నారు. గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం… ఆ సీరియల్లో సౌమ్య పాత్రలో కనిపించిన నటి పేరు సాయి ప్రియా రెడ్డి అని తెలుస్తుంది.ఈమె గతంలో ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. ఈ విషయం చాలా మందికి తెలీదు. ‘క్షేత్రం’ ‘నందీశ్వరుడు’ ‘పూలరంగడు’ ‘రెబెల్’ ‘మిర్చి’ ‘తడాఖా’ ‘జీనియస్’ ‘లక్కీ’ వంటి ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించింది. అటు తరువాత యూట్యూబ్‌లో పలు సిరీస్‌లు కూడా చేసింది.
గతేడాది వచ్చిన విశ్వక్ సేన్ ‘లైలా’ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కూడా నటించింది. ఆ సినిమాని నిర్మించింది కూడా ‘షైన్ స్క్రీన్స్’ సాహు కాబట్టి.. ఆమె టాలెంట్ ను గుర్తించి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో సౌమ్య వంటి మంచి పాత్రని ఇచ్చినట్టు స్పష్టమవుతుంది.