మొదటి వారం పర్వాలేదనిపించిన కళ్యాణ్ రామ్ ‘118’ చిత్రం…!

‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మించిన తాజా చిత్రం ‘118’. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా షాలినీ పాండే హీరోయిన్ గా నివేధా థామస్ ప్రత్యేకపాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 1 విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. మొదటి రోజు ఈ చిత్రానికి ఆశించిన ఓపెనింగ్స్ రాకపోయినప్పటికీ ….. తరువాతి రోజు నుండీ జోరందుకుంది. మొదటి వారం పూర్తయ్యేసరికీ ఈ చిత్రం 7.76 కోట్ల షేర్ ని రాబట్టింది. ఓవర్సీస్ లో ఈ చిత్రం ఏమాత్రం దూకుడు చూపించలేకపోయింది. కేవలం 100k డాలర్ల గ్రాస్ దగ్గర మాత్రమే ఆగిపోయింది. ఇక మొదటివారం కి గానూ ‘118’ చిత్రం ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 2.90
సీడెడ్ – 1.07
నెల్లూరు – 0.17


కృష్ణా – 0.54
గుంటూరు – 0.53
వైజాగ్ – 0.75


ఈస్ట్ గోదావరి – 0.42
వెస్ట్ గోదావరి – 0.33


————————————————————
ఏపీ+తెలంగాణ – 6.71
(టోటల్)

కర్నాటకా + రెస్ట్ అఫ్
ఇండియా – 0.70

ఓవర్సీస్ – 0.30
————————————————————–
టోటల్ కలెక్షన్స్ – 7.76 కోట్ల షేర్

————————————————————–

పరీక్షల సీజన్ అయినప్పటికీ ఈ చిత్రం మంచి కల్లెక్షన్లనే రాబట్టిందని చెప్పాలి. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 3 కోట్ల వరకూ షేర్ ని రాబట్టాల్సి ఉంది. ఈ వారం కూడా సినిమాలు పెద్దగా లేవు కాబట్టి ‘118’ కి కలిసొచ్చే అవకాశం ఉంది. మరి ఈ అవకాశాన్ని ‘118’ చిత్రం ఎంత వరకూ ఉపయోగించుకుంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus