ఈ ఏడాది తెలుగులో అరంగేట్రంతోనే ఆకట్టుకున్న 12 మంది కథానాయికలు ఎవరంటే?

హీరోయిన్లను ఇతర భాషల నుండి దిగుమతి చేసుకోవడం టాలీవుడ్ దర్శక నిర్మాతలకు ఎప్పటి నుంచో అలవాటు.. అందం, అభినయంతో ఆకట్టుకుంటే చాలు ఇక్కడ స్టార్ స్టేటస్ కట్టబెట్టేస్తారు.. అలా దశాబ్ద కాలానికి పైగానే అగ్ర కథానాయికలుగా చలామణీ అయిన వాళ్లూ ఉన్నారు.. ఈ 2022లో కూడా 12 మంది కొత్త భామలు తెలుగు తెరకి పరిచమయ్యారు.. వాళ్లెవరు.. ఏంటి.. అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

1. నేహా శెట్టి – డీజే టిల్లు..

‘డీజే టిల్లు’ మూవీతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన నేహా శెట్టి బంపర్ హిట్ కొట్టేసింది.. రాధిక క్యారెక్టర్‌కి 100 శాతం న్యాయం చేసింది.. మోడ్రన్ రోల్‌లో బీభత్సమైన గ్లామర్ ప్లస్ సిద్ధుతో అదిరిపోయే కెమిస్ట్రీ పండించి.. ఈ ఇయర్ కుర్రాళ్ల క్రష్ లిస్టులో తన పేరు యాడ్ చేసేసుకుంది..

2. రచితా రామ్ – సూపర్ మచ్చి..

కన్నడ బ్యూటీ రచితా రామ్.. కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’ తో ఇంట్రడ్యూస్ అయింది.. శాండల్ వుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న రచితా ఫస్ట్ తెలుగు మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా కానీ తన స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసింది..

3. సంయుక్త మీనన్ – భీమ్లా నాయక్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.. ఇందులో రానా వైఫ్ క్యారెక్టర్ చేసింది. క్లైమాక్స్ సెంటిమెంట్ సీన్‌లో తన పర్ఫార్మెన్స్‌కి మంచి రికగ్నైజేషన్ వచ్చింది.. ‘బింబిసార’ తో బ్లాక్ బస్టర్ అందుకుని.. కోలీవుడ్ స్టార్ ధనుష్ ‘వాతి’ (తెలుగులో ‘సార్’) లో ఛాన్స్ కొట్టేసింది..

4. రజీషా విజయన్ – రామారావు ఆన్ డ్యూటీ..

తమిళంలో ‘జూన్’, ‘కర్ణన్’, ‘జై భీమ్’ చిత్రాలతో ఆకట్టుకున్న రజీషా విజయన్.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ లో రవితేజ మాజీ ప్రేయసిగా కనిపించింది..

5. మానస రాధాకృష్ణన్ – హైవే..

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘హైవే’ తో మానస మానస రాధాకృష్ణన్ పరిచయమైంది.. విలేజ్ గర్ల్ క్యారెక్టర్‌లో సింపుల్‌గా కనిపించి.. తన నేచురల్ యాక్టింగ్ అండ్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరించింది.. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది..

6. మిథిలా పాల్కర్ – ఓరి దేవుడా..

విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ మూవీతో మిథిలా పాల్కర్ ఇంట్రడ్యూస్ అయింది.. మొదటి సినిమాతోనే తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు మనసు దోచుకుంది..

7. ఆశా భట్ – ఓరి దేవుడా..

ఆశా భట్ కూడా ‘ఓరి దేవుడా’ తో ఎంటర్ అయింది.. విశ్వక్ సేన్‌కి సీనియర్ లవర్‌గా కనిపించి అలరించింది ఆశా..

8. షెర్లీ సేథియా – కృష్ణ వ్రింద విహారి..

నాగ శౌర్య పక్కన ‘కృష్ణ వ్రింద విహారి’ లో కనిపించింది షెర్లీ సేథియా.. అంతకుముందు బాలీవుడ్‌లో యాక్ట్రెస్ కమ్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకన్న షెర్లీ.. తెలుగులో ఫస్ట్ మూవీతోనే బెస్ట్ అనిపించుకుంది..

9. నజ్రియా నజీమ్ – అంటే సుందరానికి..

నజ్రీయా నజీమ్.. లవ్లీ యాక్ట్రెస్.. మలయాళం, తమిళ్, డబ్బింగ్ మూవీ ‘రాజా రాణి’ తో ఆకట్టుకుంది. నేచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికి’ మూవీతో ఎంట్రీ ఇచ్చి.. తన నేచురల్ యాక్టింగ్ అండ్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో.. అలాగే సెంటిమెంట్ సీన్లలో నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది..

10. రితిక నాయక్ – అశోక వనంలో అర్జున కళ్యాణం..

రితిక నాయక్.. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఫ్రెష్ ఫేస్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్.. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ మూవీలో హీరోకి మరదలిగా కనిపించి తన చలాకీతనంతో ఆకట్టుకుంది..

11. బాంధవి శ్రీధర్ – మసూద..

ప్రస్తుతం ప్రేక్షకులను భయపెడుతున్న థ్రిల్లర్ ‘మసూద’ తో మెస్మరైజ్ చేసింది.. బ్యూటీ విత్ టాలెంట్ అంటూ కామెంట్స్ అందుకుంది..

12. మృణాల్ ఠాకూర్ – సీతా రామం..

ఈ ముద్దుగుమ్మ విషయంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘లాస్ట్ బట్ నాట్ లీస్ట్’ డైలాగ్ గుర్తు చేసుకోవాలి.. ‘సీతా రామం’ లో సీతా మహాలక్షీగా, ప్రిన్సెస్ నూర్జహాన్‌గా ఏమన్నా పర్ఫామ్ చేసిందా అసలు!.. సీత అంటే మృణాల్ అనేంతగా ఆకట్టుకుంది.. తన క్యారెక్టర్లో జెన్యూనిటీ ద్వారా ఆడియన్స్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ అయిపోయింది..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus