Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » సంక్రాంతి సీజన్లో విడుదలై అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

సంక్రాంతి సీజన్లో విడుదలై అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

  • January 10, 2020 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతి సీజన్లో విడుదలై అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

సంక్రాంతి పండుగకి దాదాపు అందరూ తమ సొంత ఊర్లకి వెళ్ళి కుటుంబాలతో గడుపుతుంటారు. ఆ తరువాత జాతర్లకు వెళ్ళడం.. కోడి పందాలు ,గుండాటలు వంటివి ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారు. అయితే ఇక్కడ జాతర మొదలవడానికి ముందో సినిమా.. అలాగే సాయంత్రం జాతర ముగిసాక మరో సినిమా చూస్తుంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సంక్రాంతి పండుగ మూడు రోజులు ఇదే టైం టేబుల్ ఫాలో అవుతుంటారు. అయితే జాతర్లకు వెళ్ళకపోయినా.. కుటుంబంతో సినిమాలకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ సినిమా అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రతీ హీరో సంక్రాంతి సీజన్ కు తమ సినిమాని విడుదల చెయ్యాలని ఆశ పడుతుంటాడు. అలా అని ఆశపడినంత మాత్రాన ఆ సీజన్ ను క్యాష్ చేసుకుంటాడు అని చెప్పలేము. కానీ సంక్రాంతికి విడుదలయ్యే ప్రతీ సినిమాకి బీభత్సమైన హైప్ క్రియేట్ అవుతుంటుంది. థియేటర్ల కోసం నిర్మాతలు కొన్ని నెలల ముందునుండీ కర్చీఫ్ వేసుకుని కూర్చుంటారు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకూ సంక్రాంతి సీజన్లో విడుదలై అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఖైదీ నెంబర్ 150 : మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన 150వ చిత్రం.. సంక్రాంతి కానుకగా విడుదలై 104 కోట్ల షేర్ ను రాబట్టింది. 2017 లో జనవరి 11న విడుదలైన ఈ చిత్రం… ఇప్పటికీ లిస్ట్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది.

4-khaidi-no-150

2) ఎఫ్ 2: వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్రం 2019 సంక్రాంతికి విడుదలై 84.51 కోట్ల షేర్ ను రాబట్టి.. నెంబర్ 2 ప్లేస్ లో ఉంది.

1f2

3) వినయ విధేయ రామ : రాంచరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన డిజాస్టర్ చిత్రం ‘వినయ విధేయ రామ’. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం 63.4 కోట్ల షేర్ ను రాబట్టింది.

19Vinaya Vidheya Rama Movie

4) అజ్ఞాతవాసి : పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 2018 సంక్రాంతి కానుకగా విడుదలై పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ ముందు నుండీ ఉన్న క్రేజ్ కారణంగా 57.3 కోట్ల షేర్ ను వసూల్ చేసింది.

8-aagnathavasi

5) నాన్నకు ప్రేమతో : ఎన్టీఆర్ 25 వ చిత్రంగా వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై 55.7 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. అయితే ఈ చిత్రం యావరేజ్ గానే నిలిచింది.

24-nannaku-prematho

6) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు : వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ … 2013 సంక్రాంతి కానుకగా విడుదలై 51.8 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.

seethamma-vaakitlo-sirimalle-chettu

7) గౌతమీపుత్ర శాతకర్ణి : బాలకృష్ణ 100 వ చిత్రంగా వచ్చిన హిట్ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’.. 2017 సంక్రాంతి కానుకగా విడుదలై 50.4 కోట్ల (టాక్స్ లేకుండా) షేర్ ను రాబట్టింది. బాలయ్య కెరీర్లో ఇదే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రం అని చెప్పాలి.

Goutamiputra Shatakarni

8) సోగ్గాడే చిన్ని నాయన : ‘కింగ్’ నాగార్జున హీరోగా వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం 2016 సంక్రాంతి కానుకగా విడుదలై 49.5 కోట్ల షేర్ ను రాబట్టి.. డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Soggade Chinni Nayana

9) ఎవడు : రాంచరణ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన ‘ఎవడు’ చిత్రం.. 2014 సంక్రాంతి కానుకగా విడుదలై 48.3 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే ఈ చిత్రాన్ని ఎక్కువ బడ్జెట్ తో మరియు ఎక్కువ రేట్లకి అమ్మడంతో ఎబౌవ్ యావరేజ్ గా మాత్రమే నిలిచింది.

Yevadu

10) నాయక్ : రాంచరణ్ డబుల్ రోల్ లో నటించిన ‘నాయక్’ చిత్రం.. 2013 సంక్రాంతి కానుకగా విడుదలై 47 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.

6Nayak Movie

11) అరుంధతి : అనుష్క ప్రధాన పాత్రలో..దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన విజువల్ వండర్.. ‘అరుంధతి’ చిత్రం 2009 సంక్రాంతి కానుకగా విడుదలై ఏకంగా 43(అన్ని భాషలు కలుపుకుని) కోట్ల షేర్ ను రాబట్టింది.

25arundathi

12) గోపాల గోపాల : పవన్ కళ్యాణ్,వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన ‘ఓ మై గాడ్’ రీమేక్ ‘గోపాల గోపాల’ చిత్రం.. 2015 సంక్రాంతి కానుకగా విడుదలై 42.10 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే ఈ చిత్రాన్ని 48 కోట్లకు అమ్మారు కాబట్టి.. యావరేజ్ గానే పరిగణించాలి.

Gopala Gopala

13) బిజినెస్ మేన్ : మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఆల్ టైం హిట్ ‘బిజినెస్ మేన్’ చిత్రం 2012 సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది.

Businessman Movie

14) శతమానం భవతి : శర్వానంద్, సతీష్ వేగేశ్న కాంబినేషన్లో వచ్చిన ‘శతమానం భవతి’ చిత్రం 2017 సంక్రాంతి కానుకగా విడుదలై.. 32.7 కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Sathamanam Bhavathi Movie

15) జై సింహా : నందమూరి బాలకృష్ణ నటించిన ‘జై సింహా’ చిత్రం.. 2018 సంక్రాంతి కానుకగా విడుదలై 29.2 కోట్ల షేర్ ను రాబట్టి .. హిట్ గా నిలిచింది.

Jai Simha Movie

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agnyaathavaasi
  • #Bussinessman
  • #Evaru
  • #F2 Movie
  • #Gopala Gopala Movie

Also Read

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

3 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago

latest news

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

8 mins ago
Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

1 hour ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

2 hours ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

3 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version