నందమూరి బాలకృష్ణ (Balakrishna) , దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) ..ల కలయికలో ‘సింహా’ (Simha), ‘లెజెండ్’ (Legend) ‘అఖండ’ (Akhanda) వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఇవి ఒక దాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. ‘అఖండ’ సినిమా అయితే బాలయ్య కెరీర్లో ఆ టైంకి అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఆ సినిమా టైంలోనే దానికి సీక్వెల్ కూడా ఉంటుంది అని దర్శకుడు బోయపాటి శ్రీను ప్రకటించారు. మొదట ద్వారక క్రియేషన్స్ లోనే ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నారు.
కానీ ఫైనల్ గా ’14 రీల్స్’ వారు ఈ ప్రాజెక్టుని నిర్మించే ఛాన్స్ దక్కించుకున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రానికి ‘BB4 ‘ అనే వర్కింగ్ టైటిల్ ను అనుకుంటున్నట్టు నిన్న ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఇదిలా ఉండగా.. ఆ పోస్టర్లో ఇది ‘అఖండ 2 ‘ ప్రాజెక్టు అని రివీల్ చేసింది లేదు.
అయితే ఆ పోస్టర్లో రథచక్రం, రుద్రాక్షలు పెట్టి ఓ హింట్ ఇచ్చారు. ఇది పక్కన పెడితే.. ‘అఖండ’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అందులో బాలకృష్ణ అఘోర పాత్ర బాగా క్లిక్ అయ్యింది. కానీ ‘అఖండ’ లో ఆ పాత్ర ఇంటర్వెల్ కి ముందు వస్తుంది. సెకండాఫ్ అంతా ఉంటుంది. ‘అఖండ 2 ‘ లో మాత్రం ఈ పాత్ర పూర్తి స్థాయిలో ఉంటుందట.
నార్త్ లో కూడా షూటింగ్ జరపనున్నారు. దీంతో బడ్జెట్ కూడా పెరగనుంది అని తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘అఖండ 2’కి రూ.150 కోట్ల బడ్జెట్ ఫిక్స్ చేశారట. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య రూ.30 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేసినట్లు ఇన్సైడ్ టాక్.