Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?
- November 3, 2026 / 02:30 PM ISTByPhani Kumar
హీరోయిన్ రాధికా ఆప్టే(Radhika Apte) ఏం మాట్లాడినా సంచలనమే. టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ.. పరిపూర్ణ నటి అనిపించుకున్నప్పటికీ, ఇంటర్వ్యుల్లో పాల్గొంటున్నప్పుడు మాత్రం సెన్సిబిలిటీస్ ను గాలికి వదిలేస్తూ ఉంటుంది. ఆ హీరోతో నటించడానికి ఇబ్బంది పడ్డాను, ఈ సీన్ చేయడానికి ఇబ్బంది పడ్డాను అంటూ అందరిమీద అబాండాలు వేయడం ఈమెకు అలవాటు. ముఖ్యంగా ఛాన్స్ దొరికిన ప్రతిసారి సౌత్ సినిమా మేకర్స్ గురించి, ఇక్కడి హీరోల గురించి ఏవో ఒక నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉంటుంది రాధికా ఆప్టే.
Radhika Apte

గతంలో ‘ఓ సౌత్ సీనియర్ హీరో షూటింగ్ టైమ్లో తనని వేధించాడు’ అంటూ పరోక్షంగా నందమూరి బాలకృష్ణపై నెగిటివ్ కామెంట్స్ చేసింది రాధికా. కొన్నాళ్ళకి ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు. అయితే లేటెస్ట్ ఇంటర్వ్యూలో మరోసారి అదే టాపిక్ ను సాగదీసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది రాధికా. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “ఒక తెలుగు సినిమాలో నాకంటే పెద్ద వయసు కలిగిన హీరోతో రొమాన్స్ చేయాల్సి వచ్చింది.
షూటింగ్ సెట్ అంతా పితృస్వామ్య వాతావరణం ఉండేది. అయితే ఆ సినిమాలో మేనమామను పెళ్లి చేసుకునే పాత్రలో నేను నటించాను. ఆ పాత్ర పోషించడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అంతేకాదు నా పాత్ర కథ మధ్యలోనే చనిపోతుంది. ఆ తర్వాత హీరో నన్ను పక్కన విసిరేసి భారీ యాక్షన్ సీన్స్ చేస్తాడు.” అంటూ చెప్పుకొచ్చింది. రాధికా కామెంట్స్ పై బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు, యావత్ తెలుగు సినీ ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎక్కువ శాతం గ్లామర్ సీన్స్ లో నటించే రాధికా.. తెలుగులో 2 బాలకృష్ణ సినిమాల్లో నటించి క్యాష్ చేసుకున్నా రాధికా.. అవసరం తీరిపోయాక ఇలాంటి నెగిటివ్ కామెంట్లు చేయడం సబబు కాదు అంటూ కౌంటర్లు విసురుతున్నారు. ఒక్క రాధికా ఆప్టే అనే కాదు చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు సౌత్ లో సినిమాలు చేసి పాపులర్ అయ్యాక.. బాలీవుడ్ వెళ్ళి ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయడం గతంలో చాలా చూశాం. ఇటీవల జాన్వీ కపూర్ సైతం ‘పెద్ది’ సినిమా యూనిట్ పై ఇలాంటి నెగిటివ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?
• For a Telugu film, I had to marry my own Uncle in the film
• I had to romance a very older person – very patriarchal situation in place. This was the most toughest thing for me
— #RadhikaApteWhich Movie and Hero she’s referring to ❓
#Akka https://t.co/l2hIBdIraZ
— VCD (@VCDtweets) November 3, 2026
















