Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

విజయ్‌ దేవరకొండ లిస్టా.. ఇదేంటి అనుకుంటున్నారా? మొన్నీ మధ్య ‘ఎపిక్‌’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ టాలీవుడ్‌ ఇప్పుడు హిట్‌ మోడ్‌లో ఉందని చెబుతూ రీసెంట్‌గా విజయం అందుకున్న సినిమాల గురించి మాట్లాడాడు. పనిలో పనిగా తమ సినిమాలు కూడా వస్తున్నాయని, అలాగే మరికొంతమంది హీరోల సినిమాలు కూడా వస్తున్నాయని చెబుతూ.. అన్నీ హిట్‌ కొడతాయి అంటూ మంచి వైబ్‌ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో విజయ్‌ దేవరకొండ లిస్ట్‌ అంటూ ఒకటి వైరల్‌ అవుతోంది.

Vijay Devarakonda

ఆ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. రానున్న మూడు నెలలు టాలీవుడ్‌లో అదిరిపోతాయి. రెండ్రోజుల్లో ‘ఎపిక్‌’ సినిమా వస్తుంది. ఆ తర్వాత నాని – శ్రీకాంత్‌ ఓదెల ‘ది ప్యారడైజ్‌’ వస్తుంది. ఆ తర్వాత నేను, రాహుల్‌ సాంకృత్యాన్‌ చేస్తున్న ‘రణబాలి’ వస్తుంది. ఆ వెంటనే రష్మిక ‘మైసా’ సినిమా వస్తుంది అని చెప్పాడు. తరుణ్‌ భాస్కర్‌ ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్‌’ గురించి కూడా మాట్లాడాడు డిసెంబరు గురించి మాట్లాడుతూ ప్రభాస్‌ ‘ఫౌజీ’, బాలకృష్ణ ‘దాదా’ సినిమాల గురించే చెప్పాడు విజయ్‌. అదే నెలలో రిలీజ్‌ డేట్‌ పెట్టుకున్న ‘కింగ్‌ 100’ గురించి చెప్పలేదు.

ఆ లెక్కన మొత్తంలో విజయ్‌ లిస్ట్‌లో ఏడు సినిమాలు వచ్చి పడ్డాయి. వాటిలో రెండు సినిమాలు ‘ఎపిక్‌’, ‘ది ప్యారడైజ్‌’ వచ్చి ఫలితాల విషయంలో ఇండస్ట్రీ రీసెంట్‌ ఫామ్‌ను దెబ్బ తీశాయి. దీంతో విజయ్‌ చెప్పిన సెంటిమెంట్‌కి బ్రేక్‌ పడింది. ఈ క్రమంలో రాబోయే ఐదు సినిమాల గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అక్టోబరు 16న వస్తామంటున్న ‘రణబాలి’ నుండి డిసెంబరు 24 వస్తున్న ‘దాదా’ వరకు ఏమవుతాయో అనే చర్చ స్టార్ట్‌ అయింది. మధ్యలో ఉన్న ‘మైసా’, ‘ఈఎన్‌ఈ రిపీట్‌’ ఫలితాల మీద లుక్‌ పడింది.

అయితే డిసెంబరు 4న వస్తామని చెప్పి ఇప్పుడు ఆగిపోయిన ‘ఫౌజీ’, అలాగే విజయ్‌ దేవరకొండ మరచిపోయాడో లేక వదిలేశాడో తెలియని ‘కింగ్‌ 100’ ఫలితాలు ఏమవుతాయి అనే బట్టి విజయ్‌ వైబ్‌ లెక్క తేలుతుంది.

 ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus