యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మిర్చి సినిమాకు అవార్డుల పంట పండింది. కొరతస్ శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఆరు కేటగిరీల్లో నంది అవార్డులను కైవశం చేసుకుంది. 2013 లో రిలీజ్ అయిన చిత్రాల్లో ఉత్తమమైన వాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు అవార్డులను ప్రకటించింది. సీనియర్ డైరక్టర్ కోడి రామకృష్ణ నేతృత్వంలోని కమిటీ అత్యుతమ ప్రతిభ కనబరిచిన నటులకు, టెక్నీషియన్లను అవార్డులతో గౌరవించింది. 2013 లో నంది అవార్డు గ్రహీతలు వీరే ..
ఉత్తమ చిత్రం : మిర్చి
ఉత్తమ రెండో చిత్రం : నా బంగారు తల్లి
ఉత్తమ మూడో చిత్రం : ఉయ్యాల జంపాలా
ఉత్తమ కుటుంబ కథా చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఉత్తమ నటుడు : ప్రభాస్ (మిర్చి)
ఉత్తమ నటి : అంజలీ పాటిల్ (నా బంగారు తల్లి)
ఉత్తమ దర్శకుడు : దయా కొడవగంటి
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత : మేర్లపాక గాంధీ ( వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ )
ఉత్తమ విలన్ : సంపత్ రాజ్ (మిర్చి)
ఉత్తమ తొలి చిత్రం దర్శకుడు : కొరటాల శివ (మిర్చి)
ఉత్తమ కథా రచయిత : ఇంద్రగంటి మోహన్ కృష్ణ
ఉత్తమ పాటల రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఉత్తమ మాటల రచయిత : త్రివిక్రమ్ శ్రీనివాస్
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్ ( అత్తారింటికి దారేది)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ : కాళీచరణ్ (మిర్చి)
ఉత్తమ సహాయ నటుడు : ప్రకాశ్ రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)
ఉత్తమ హాస్యనటుడు : తాగుబోతు రమేష్ ( వెంకటాద్రి ఎక్స్ ప్రెస్)
ఉత్తమ గాయకుడు : కైలాష్ (మిర్చి)
ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ : విజయ సింహారెడ్డి ( భక్త సిరియాళ)
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.