2017 లో రికార్డు సృష్టించేందుకు సిద్ధమయిన సినిమాలు

  • January 4, 2017 / 01:09 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమ 2016కి ధృవ వంటి విజయంతో వీడ్కోలు పలికి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ ఏడాది సినీ అభిమానులను ఆకట్టుకోవడానికి భారీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. 2017 లో ఊరిస్తున్న చిత్రాలపై ఫోకస్..

ఖైదీ నంబర్ 150మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఖైదీ నంబర్ 150 మూవీ కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆలస్యంగా పట్టాలెక్కిన ఈ మెగాస్టార్ చిరంజీవి మూవీ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది. తొమ్మిదేళ్ల తర్వాత చిరు హీరో గా నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటల జోరుని ఎంజాయ్ చేస్తున్నారు.

గౌతమి పుత్ర శాతకర్ణినందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ తో సంచలనం సృష్టించింది. జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శాతవాహన చక్రవర్తిగా బాలకృష్ణ రాయల్ లుక్ లో కనిపించి అంచనాలను భారీగా పెంచారు. బాలీవుడ్ నటి హేమ మాలిని ఇందులో ప్రత్యేక పాత్రలో కనిపిస్తుండగా, శ్రీయ శరణ్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి అందరితో “జై బాలయ్య” అని అనిపించుకోనుంది.

శతమానం భవతిప్రస్తుతం ప్రజల జీవన సరళిలో వేగం పెరిగిపోయింది. దాంతో బంధాలు, అనుబంధాలకు ప్రతి ఒక్కరూ దూరమవుతున్నారు. వారు కోల్పోతున్న విలువలను గుర్తుకుతెచ్చే విధంగా మూడు తరాల కథతో తెరకెక్కిన చిత్రం శతమానం భవతి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి దిల్రాజు నిర్మించిన ఈ చిత్రంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ఈ సినిమా కోసం మిక్కీ. జే. మేయర్ స్వరపరిచిన పాటలు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఎన్ని తీపి జ్ఞాపకాలను వెలికితీయనుందో సంక్రాంతి తెలియనుంది.

కాటమరాయుడుపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో అయన నటిస్తున్న కాటమరాయుడు షూటింగ్ వేగంగా జరుగుతోంది. శరత్ మరార్ నిర్మిస్తున్న ఇందులో శృతిహాసన్ ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది. జనసేన అధినేతగా దూసుకు పోతున్న ఈ తరుణంలో పవర్ స్టార్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తుండడం ఈ చిత్రానికి హైప్ ని తీసుకొస్తోంది. రాయల సీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని మార్చి 31న రిలీజ్ చేసేందుకు నిర్మాత శరత్ మరార్ ఫిక్స్ అయ్యారు. ఈసారి పవన్ ఎన్ని రికార్డులను బద్దలు కొడుతారో చూడాలి.

బాహుబలి 2తెలుగు చిత్ర పరిశ్రమని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి. గతేడాది జులై 10 న విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విజయ డంఖా మోగించింది. ఈ చిత్రానికి ముగింపు కూడా మరింత గ్రాండ్ గా ఉండాలని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి 2 ని తెరకెక్కిస్తున్నారు. గతంలో ఏ చిత్రం కోసం ఎదురు చూడనంతగా ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా సినీ జనాలు ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపుకు వచ్చే ఏడాది ఏప్రిల్ 28 తో తెరపడనుంది. ఆ తర్వాత రికార్డుల మోత ఆపడం మాత్రం కష్టమే.

గురువయసుకు తగిన పత్రాలు చేస్తూ సేఫ్ జర్నీ చేస్తున్న విక్టరీ వెంకటేష్ మరో సారి తనకు తగ్గ కథతో వస్తున్నారు. హిందీ, తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘సాలా ఖద్దూస్’ సినిమాను తెలుగులో ‘గురు’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా నటిస్తున్నారు. ఈ మూవీ ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన సుధా కొంగర తెలుగు వెర్షన్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో వెంకీ కండలు పెంచి సూపర్ హిట్ పంచ్ ఇవ్వనున్నారు.

ఓం నమో వెంకటేశాయదర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు అన్నమయ్య, శ్రీ రామ దాసు, షిరిడి సాయి సినిమాల తర్వాత చేస్తున్న మరో భక్తి రస కథా చిత్రం “ఓం నమో వెంకటేశాయ”. హథీ రామ్ బాబాగా కింగ్ నాగార్జున ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో అనుష్క వేంకటేశ్వరుని భక్తురాలు కృష్ణమ్మ పాత్రకు ప్రాణం పోస్తోంది. జె.కె. భారవి కథ అందిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామిగా హిందీ నటుడు సౌరభ్ రాజ్ జైన్, శ్రీదేవిగా విమలా రామన్, భూదేవిగా పావని గంగి రెడ్డి నటిస్తున్నారు. దర్శకేంద్రుడు ఐదేళ్ల తర్వాత చేస్తున్న మూవీ కావడంతో దీనిపై నాగ్ అభిమానులు గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు.

రోబో 2 .0తమిళ చిత్రం అయినప్పటికీ తెలుగు సినిమాతో సమానంగా రోబో 2 .0 క్రేజ్ సంపాదించుకుంది. ఆరేళ్లక్రితం శంకర్ సృష్టించిన రోబోకి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ సైన్టిస్ట్ గా నటిస్తుండగా, ఆయనకు పోటీగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్ విలనిజం చూపించనున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ అంచనాలను అమాంతం పెంచింది. 360 కోట్ల భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్నఈ మూవీ “ఐ” బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ ఫిల్మ్ ఎంత థ్రిల్ కలిగించనుందో తలుచుకుంటే హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోతోంది.

నక్షత్రంసిందూరం, ఖడ్గం చిత్రాలలో పోలీస్ ని చాలా బాగా చూపించారు కృష్ణవంశీ. అటువంటి క్రియేటివ్ డైరక్టర్ మరో సారి పోలీస్ కథతో చేస్తున్న సినిమా నక్షత్రం. యువ హీరో సందీప్ కిషన్ తో పాటు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కీలక రోల్ పోషిస్తున్న మూవీ మొదలయినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తోంది.

సంభవామిసూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్ అనగానే అందులో ఓ వైబ్రేషన్ వస్తోంది. 100 కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూపర్ స్టార్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తుండడం మరో అట్రాక్షన్. సినిమాటోగ్రాఫర్ గా సంతోష్ శివన్, సంగీత దర్శకునిగా హరీష్ జయరాజ్ పనిచేస్తున్న ఈ మూవీలో తమిళ నటుడు, దర్శకుడు ఎస్.జె. సూర్య విలన్ గా నటిస్తుండడం ఆసక్తి కలిగించేవిషయం. తాజాగా “సంభవామి” అని టైటిల్ ప్రకటించి అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ సినిమాతో తమిళంలో ప్రిన్స్ జెండా పాతేయడం ఖాయం అంటున్నారు.

డీజేస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 2016 లో సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ ఏడాది దువ్వాడ జగన్నాథమ్ (డీజే) గా రాబోతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న 25వ చిత్రమిది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ లో అల్లు అర్జున్ సరసన ముకుంద ఫేమ్ పూజ హెగ్డే నటిస్తోంది. బన్నీ సైలంట్ గా రెండు షెడ్యూల్ పూర్తి చేసేసారు. మార్చిలో ఎంట్రీ ఇవ్వడానికి కష్టపడుతున్నారు.

ఎన్టీఆర్, బాబీ మూవీహ్యాట్రిక్ అందుకున్న తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాగా అలోచించి బాబీ చెప్పిన కథను ఒకే చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ వందకోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జనవరి 26 నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ ఫిల్మ్ లో తారక్ మూడు పాత్రల్లో కనిపించనుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. నందమూరి అభిమానులకు ఈ మూవీ ఓ గిఫ్ట్ లాంటిదని చిత్ర బృందం ఇప్పుడే స్పష్టం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus