Chiranjeevi: ఈ ఏడాది చిరంజీవికి కలిసిరాలేదా?

  • August 13, 2022 / 10:57 AM IST

2022 సంవత్సరం మెగాస్టార్ చిరంజీవికి కలిసిరాలేదా అనే ప్రశ్నకు నెటిజన్ల నుంచి అవుననే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి చరణ్ హీరోలుగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆచార్య సినిమా ఈ ఏడాది థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చలేదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ విషయంలో కూడా ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తితో ఉన్నారు.

మరోవైపు చిరంజీవి పలు సినిమాల ప్రమోషన్స్ కు హాజరవుతున్నా ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోవడం లేదు. చిరంజీవి గెస్ట్ గా మిషన్ ఇంపాజిబుల్, పక్కా కమర్షియల్ సినిమాల ఈవెంట్లకు హాజరు కాగా ఈ రెండు సినిమాలు ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చినా కమర్షియల్ గా ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరించిన లాల్ సింగ్ చద్దా సినిమా థియేటర్లలో విడుదలై ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.

చిరంజీవి లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ కోసం ఎంతో కష్టపడినా సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి మంచికి పోతున్నా చెడు ఎదురవుతుండటంతో కొంతమంది కావాలనే ఆయనను ట్రోల్ చేస్తుండటం గమనార్హం. అయితే మెగా అభిమానులు మాత్రం చిరంజీవి విమర్శలను పట్టించుకోరని ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందువరసలో ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమాతో చిరంజీవి ఖాతాలో సక్సెస్ చేరడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు. గాడ్ ఫాదర్ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు చిరంజీవికి క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus