The Weekend Releases: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 25 సినిమాలు/సిరీస్ లు..!

సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’ ‘వాల్తేరు వీరయ్య’ వంటి పెద్ద సినిమాలతో పాటు ‘కళ్యాణం కమనీయం’ వంటి చిన్న సినిమా అలాగే ‘తెగింపు’ ‘వారసుడు’ వంటి డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే ‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ సినిమాలు మాత్రమే ఈ సంక్రాంతికి నిలబడ్డాయి. మిగిలిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. గత శుక్రవారం కూడా ఆ సినిమాల హవానే నడిచింది. అయితే ఈ వారం కొత్త సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. రిపబ్లిక్ డే హాలిడే కూడా ఉండడంతో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల పై జనాల ఫోకస్ పడింది. థియేటర్లలో మాత్రమే కాదు ఓటీటీల్లో కూడా పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) పఠాన్ : షారుఖ్ ఖాన్, దీపిక పదుకొణె, జాన్ అబ్రహం కాంబినేషనలో రాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి.తెలుగు ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జనవరి 25న విడుదల కాబోతుంది.

2) హంట్ : సుధీర్ బాబు హీరోగా కోలీవుడ్ నటుడు భరత్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 26న విడుదల కాబోతుంది. మహేష్ సూరపనేని ఈ చిత్రానికి దర్శకుడు.

3) గాంధీ గాడ్సే ఏక్ యుధ్ : ఈ బాలీవుడ్ మూవీ జనవరి 26న విడుదల కాబోతుంది.

4) సింధూరం(2023) : గౌరి హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 26న విడుదల కాబోతుంది.

5) హు యామ్ ఐ : ఈ బాలీవుడ్ మూవీ జనవరి 27న విడుదల కాబోతుంది.

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

6) 18 పేజెస్ : నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పలనాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేశాడు. డిసెంబర్ 23న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ అబౌవ్ యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. జనవరి 27 నుండి ‘ఆహా’ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

7) నార్విక్ : ఈ హాలీవుడ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

8) బ్లాక్ షన్ షైన్ బేబీ : ఈ హిందీ డాక్యుమెంటరీ జనవరి 24 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

9) ఎగైనెస్ట్ ద రోప్స్ : ఈ స్పానిష్ వెబ్ సిరీస్ జనవరి 25 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

10) బాడీస్ బాడీస్ బాడీస్ : ఈ హాలీవుడ్ మూవీ జనవరి 25 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

11) డేనియల్ స్పెల్ బౌండ్ : ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 జనవరి 26 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

12) 18 పేజెస్ : ఈ మూవీ జనవరి 27 నుండి నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ కానుంది.

13) యాన్ యాక్షన్ హీరో : ఈ హిందీ మూవీ జనవరి 27 నుండి నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రీమింగ్ కానుంది.

14) యూ పీపుల్ : ఈ హాలీవుడ్ మూవీ జనవరి 27 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

15) లాక్ వుడ్ అండ్ కో : ఈ హాలీవుడ్ సిరీస్ జనవరి 27 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

16) ద ఇన్విటేషన్ : ఈ హాలీవుడ్ మూవీ జనవరి 28 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

17) రాంగీ : ఈ తమిళ మూవీ జనవరి 29 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

18) ఎక్స్ ట్రార్డినరీ : ఈ హాలీవుడ్ సిరీస్ జనవరి 25 నుండి డిస్నీ ప్లస్ హాట్ సార్లో స్ట్రీమింగ్ కానుంది.

19) డియర్ ఇష్క్ : ఈ బాలీవుడ్ సిరీస్ జనవరి 25 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

20) శాటర్ డే నైట్ : ఈ మలయాళం మూవీ జనవరి 27 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

21) అయలీ : ఈ తెలుగు సిరీస్ జనవరి 26 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

22) జన్ బాజ్ హిందుస్థాన్ కే : ఈ హిందీ సిరీస్ జనవరి 26 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

23) ఎంగ్గా హాస్టల్ : ఈ తమిళ మూవీ జనవరి 27 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

24) షాట్ గన్ వెడ్డింగ్ : ఈ హాలీవుడ్ మూవీ జనవరి 27 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

25) స్రింకింగ్ : ఈ హాలీవుడ్ సిరీస్ జనవరి 27 నుండి యాపిల్ టీవీ ప్లస్ లో స్ట్రీమింగ్ కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus