25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే
- September 29, 2026 / 11:59 AM ISTByPhani Kumar
‘బాల రామాయణం’ తర్వాత జూ.ఎన్టీఆర్ హీరోగా ‘నిన్ను చూడాలని’ సినిమా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే వెంటనే రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెంబర్ 1′(Student No: 1) చేశాడు జూనియర్ ఎన్టీఆర్. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఈ సినిమాని ‘స్వప్న సినిమా’ పై అశ్వినీదత్ నిర్మించారు. 2001 సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యింది ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రం.
Student No: 1 Collections

ఈ సినిమా వస్తుంది అనే ప్రకటన వచ్చినప్పుడు.. ఆడియన్స్..లో పెద్దగా అంచనాలు లేవు. కానీ ఎం.ఎం.కీరవాణి సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్ కావడంతో.. హైప్ నెలకొంది. రిలీజ్ రోజున మొదటి షోతోనే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు సాధించి.. ఎన్టీఆర్ ఖాతాలో మొదటి సక్సెస్ పడేలా చేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 2.38 cr |
| సీడెడ్ | 2.20 cr |
| ఉత్తరాంధ్ర | 2.12 cr |
| ఈస్ట్ | 0.90 cr |
| వెస్ట్ | 0.86 cr |
| గుంటూరు | 0.95 cr |
| కృష్ణా | 0.85 cr |
| నెల్లూరు | 0.62 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 10.88 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.70 Cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 11.58 cr |
‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఫుల్ రన్లో ఏకంగా రూ.11.58 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కి ఆల్మోస్ట్ రూ.5.58 కోట్ల ప్రాఫిట్స్ అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాదు 71 కేంద్రాల్లో అర్దశతదినోత్సవం, 28 కేంద్రాల్లో శతదినోత్సవం వేడుకలు జరుపుకుంది స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం.












