37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే
- October 6, 2026 / 12:27 PM ISTByPhani Kumar
అక్కినేని నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ డెబ్యూ క్రైమ్ యాక్షన్ డ్రామా ‘శివ'(Siva). 1989వ సంవత్సరం అక్టోబర్ 5న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ‘ఎస్ ఎస్ క్రియెషన్స్’ సంస్థపై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగార్జునకి జోడీగా అమల నటించగా ఇళయరాజా సంగీతం అందించారు. ‘బొటానీ క్లాస్ ఉంది’ అనే పాట అప్పట్లో ఓ ఊపు ఊపింది. అయినప్పటికీ మొదట్లో ఈ సినిమాపై ఎటువంటి హైప్ లేదు.
Siva

పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘శివ’ చిత్రం. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. రామ్ గోపాల్ వర్మ డైరక్షన్, నాగార్జున అగ్రెసివ్ పెర్ఫార్మెన్స్.. ముఖ్యంగా సైకిల్ చెయిన్ ఫైట్ ఈ సినిమాకి కల్ట్ స్టాటస్ ను తెచ్చిపెట్టింది. తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాల్లో ‘శివ’ కూడా ఒకటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
కేవలం రూ.75 లక్షల బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా విడుదలై ఈ అక్టోబర్ 5కి 37 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా ఒకసారి బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 1 cr |
| ఆంధ్ర(టోటల్) | 3 cr |
| ఏపీ +తెలంగాణ(టోటల్) | 4 cr (షేర్) |
| వరల్డ్ వైడ్ టోటల్ (షేర్) | 6.5 కోట్లు |
| వరల్డ్ వైడ్ టోటల్ (గ్రాస్) | 11 కోట్లు |
‘శివ’ చిత్రం ఆ రోజుల్లో రూ.1 కోటి బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా ఏకంగా రూ.6.5 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.11 కోట్లు కలెక్ట్ చేసింది. బయ్యర్లకి రూ.5.5 కోట్ల వరకు లాభాలు అందించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు 22 సెంటర్స్ లో శతదినోత్సవం, 5 సెంటర్స్ లో సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా జరుపుకుంది ‘శివ’ చిత్రం.
బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’














