‘7/జి బృందావన కాలనీ’ హీరోయిన్ విడాకులు తీసుకోవడానికి కారణం అదే…!

Advertisement

2002 వ సంవత్సరంలో వినీత్, అబ్బాస్ లు హీరోలుగా వచ్చిన ‘నీ ప్రేమకై’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సోనియా అగర్వాల్. ఆ తరువాత జగపతి బాబుతో ‘థమ్’ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ రెండు సినిమాలు బాగా ఆడలేదు. దాంతో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే 2004 లో వచ్చిన తమిళ డబ్బింగ్ చిత్రం ‘7/జి బృందావన కాలనీ’ మాత్రం ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడేలా చేసింది.

‘7/జి’ దర్శకుడు అయిన సెల్వ రాఘవన్ నే ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2006 లో వీరి పెళ్లి జరిగింది. కొన్నాళ్ళ పాటు బాగానే కలిసున్నారు.. అయితే కారణాలు ఏంటో తెలీదు కాని 2010లో వీరు విడాకులు తీసుకున్నారట. అందుకు కారణాలు ఏంటి అన్నది ఆమె ఇటీవల ఓ సందర్భంలో తెలిపింది. ‘కెరీర్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడటంతో మేము దూరం అయ్యాము. కానీ స్నేహితులు మాదిరి కలిసే ఉంటున్నాం’ అంటూ సోనియా చెప్పుకొచ్చింది. ఇటీవల ఈమె రెండో పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం కూడా నడిచింది.

కానీ అందులో నిజం లేదని..వెడ్డింగ్ ప్లానార్ గా మారబోతుంటే అలా మిస్ లీడ్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చింది.ఇక సెల్వ రాఘవన్ తో విడాకులు తీసుకున్న తరువాత సోనియా… ఎన్టీఆర్.. ‘టెంపర్’, అలాగే సాయి తేజ్ ‘విన్నర్’ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రామ్ హీరోగా కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘రెడ్’ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర పోషించిందని సమాచారం.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus