‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ అంటే టాలీవుడ్ టాప్ బ్యానర్స్ లో ఒకటి అని అందరూ భావిస్తారు. కానీ గత ఏడాది నుండి వీళ్ళకి కలిసి రావడం లేదు. (Phalana Abbayi Phalana Ammayi) ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ (Ramabanam) ‘రామబాణం’ (BRO) ‘బ్రో’ ‘ఈగల్’ (Eagle) వంటివి ప్లాప్ అయ్యాయి. ఎంతో ఇష్టపడి రిలీజ్ చేసిన ‘టక్కర్’ (Adipurush) ‘ఆదిపురుష్’ (Sapta Sagaralu Dhaati) ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ కూడా నష్టాలనే మిగిల్చాయి.
100 సినిమాలను నిర్మించడమే లక్ష్యంగా సినిమాలు చేసుకుంటూ పోతున్నట్టున్నారు కానీ, మంచి కంటెంట్ ప్రేక్షకులకి అందించాలి అనే ఆలోచనని వీళ్ళు పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. ఇలా ఎందుకు చెబుతున్నాం అంటే..! ఓ ప్లాప్ డైరెక్టర్ కి వీళ్ళు రూ.75 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తామని హామీ ఇచ్చారట. ఆ ప్లాప్ డైరెక్టర్ మరెవరో కాదు (Sriwass) శ్రీవాస్. ఇతను 7 సినిమాలు తీశాడు. కానీ అందులో 2 మాత్రమే హిట్ అయ్యాయి.
ముఖ్యంగా గత సినిమాలు (Saakshyam) ‘సాక్ష్యం’ ‘రామబాణం’ వంటి సినిమాలకి అయితే ఇతను రూ.50 కోట్ల నుండి రూ.60 కోట్ల వరకు ఖర్చు పెట్టించినట్టు టాక్. ‘పీపుల్ మీడియా..’ వారికీ ‘రామబాణం’ వంటి కళాఖండాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ సినిమాకి ఇతను తీసిన వేస్ట్ ఫుటేజ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమాకి ఓటీటీ బిజినెస్ కూడా అంత ఈజీగా అవ్వలేదు. అయినా సరే ‘పీపుల్ మీడియా సంస్థ’ శ్రీవాస్ కి రూ.75 కోట్ల బడ్జెట్ సినిమా ఆఫర్ చేయడం అంటే వాళ్ళ గట్స్ కి మెచ్చుకోవాల్సిందే.
‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!
స్టార్ హీరో అజిత్ హెల్త్ అప్‌డేట్ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?