కళ్యాణ్ రామ్ ‘ఇజం’ సినిమాలోని ప్రత్యేకతలు

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరో గా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం “ఇజం”. స్పీడ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన ఈ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ మూవీ అక్టోబర్‌ 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ప్రత్యేకతలపై ఫోకస్…

మేకోవర్పూరి జగన్నాధ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ అన్నప్పుడే ఈ చిత్రంపై భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక ఫస్ట్ లుక్ తర్వాత ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. తొలిసారిగా కళ్యాణ్ రామ్ ఇందులో సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించనున్నారు..

వాయిస్ ఓవర్ఇజం లో అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కనిపించాల్సి ఉంది. తారక్ స్పెషల్ ఎంట్రీకి పూరి కూడా ప్లాన్ చేశారు. అయితే తామిద్దరం కలిసి ఫుల్ లెన్త్ మూవీలోనే నటించాలని ఉద్దేశంతో చివరి క్షణంలో ఎన్టీఆర్ పక్కకు తప్పుకున్నారు. అయితే ఇజం కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమా బిగినింగ్ లోనే తారక్ మాటలను వినవచ్చు.

ఫేమస్ అయిన మాస్క్ఇజం ఫస్ట్ లుక్ నుంచి కళ్యాణ్ రామ్ మాస్క్ యువతను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం విడుదలకు ముందే మాస్క్ బాగా ఫేమస్ అయింది. హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ ఈవెంట్ కామిక్ కాన్ లో కొంతమంది కళ్యాణ్ రామ్ అభిమానులు ఈ మాస్క్ తో సందడి చేసారు.

రీ షూట్పూరి ముందుగా అనుకున్న ప్రకారం ఇజం సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాలి. అందుకు తగినట్లుగా డైరక్టర్ షూటింగ్ కంప్లీట్ చేశారు. అయితే హీరో, ప్రొడ్యూసర్ అయిన కళ్యాణ్ రామ్ కొన్ని సీక్వెన్స్ రీ షూట్ చేయాలనీ కోరడంతో పూరి బృందం మళ్లీ స్పెయిన్ కి వెళ్లింది. కళ్యాణ్ రామ్ కోరుకున్నట్లు సీన్లు తెరకెక్కించారు.

పూరి గానంపూరి జగన్నాథ్ కథలను, డైలాగులను సొంతంగా రాసుకొని ఇండస్ట్రీ హిట్ లను కొట్టారు. ఈ సారి పాటల రచయితగా మారారు. టైటిల్ సాంగ్ ని రచించడమే కాకుండా సొంతంగా పాడారు. అంతేకాదు సింగర్ ధనుంజయ్ తో కలిసి మరో పాటను పూరి ఆలపించారు.

కొత్త నటిపూరి జగన్, కళ్యాణ్ రామ్ ల్లో ఉండే కామన్ థింగ్ ఏమిటంటే కొత్త హీరోయిన్లను పరిచయం చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఇజం లోను నయా బ్యూటీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. 2015 లో మిస్ ఇండియాగా ఎన్నికైన అదితి ఆర్య ఇజంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె గ్లామర్ సినిమాకు ప్లస్ కానుంది.

భారీ తారాగణంప్రముఖ నటులు ఇజంలో అదరగొట్టనున్నారు. జావేద్ బాయ్ గా జగపతిబాబు, మంత్రి గా పోసాని కృష్ణమురళి ఎంటైర్ టైన్ చేయనున్నారు. వీరితో పాటు గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ల భరణి, జయ ప్రకాష్‌ రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, బండ రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

హెవీ బడ్జెట్ఇజం చిత్రంకోసం 30 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ మొత్తం దర్శకుడు పూరి జగన్నాథ్ కి ఎక్కువయేమి కాదు. కొన్నేళ్ల క్రితమే ఇంతకంటే భారీ బడ్జెట్ తో సినిమాలు తీశారు. అయితే కళ్యాణ్ రామ్ ఇదివరకు నటించిన, నిర్మించిన ఏ సినిమాకు 20 కోట్లు ఖర్చు కాలేదు. తొలి సారి ఇజం చిత్రం కోసం 30 కోట్లు వెచ్చించారు.

ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలతో రూపుదిద్దుకున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడం గ్యారంటీ అని చిత్ర బృందం ధీమాగా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus