రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా ఓ సినిమా చాలా రోజుల క్రితమే అనౌన్స్ అయింది. ఆ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ చేతులు మారి, మారి.. ఆఖరికి సిబి చక్రవర్తి చేతికి వచ్చింది. తలైవా 173వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అందులో ఓ విషయం గురించి ఇప్పటికే దాదాపు క్లారిటీ వచ్చేయగా.. ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదే సినిమాలో రజనీ గెటప్‌లు.
సిబి చక్రవర్తి రాసుకున్న కథ ప్రకారం ఈ సినిమాలో రజనీకాంత్ మొత్తంగా మూడు డిఫరెంట్ గెటప్‌లలో కనిపిస్తారని వార్తలొచ్చాయి. దాని కోసం సిబి టీమ్ గత కొన్ని రోజులుగా లుక్ క్రియేషన్ పనుల్లో ఉందని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో మూడు గెటప్‌ల కోసం ఇంత కష్టపడుతున్నారా అనే డౌట్ వచ్చింది. దీని వెనుక జరిగిన పని తెలిశాక సిబి చక్రవర్తి గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రజనీ పాత్ర కోసం ఇప్పటివరకు 80కిపైగా లుక్స్ సిద్ధం చేశారట సిబి అండ్ కో.
దేశంలో టాప్ లుక్ డిజైనర్లతో కలసి సిబి చక్రవర్తి మొత్తంగా 80 లుక్స్ సిద్ధం చేశారని, వాటిని త్వరలో రజనీకాంత్‌పై టెస్ట్ చేసి.. అందులోంచి మూడు లుక్‌లు ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. ఈ వారంలోనే లుక్స్ ఫైనల్ అవుతాయని కోడంబాక్కం వర్గాల సమాచారం. వీటిలో ఒకటి ఊరమాస్ లుక్ ఉండబోతోందని సమాచారం. ఇప్పటివరకు రజనీని అలాంటి లుక్‌లో కనిపించలేదు అని కోలీవుడ్ వర్గాల సమాచారం.
ఇక ఈ సినిమా తండ్రీ కొడుకుల నేపథ్యంలో ఉంటుందని, కొడుకు పాత్ర కోసం యువ హీరోన ఎంపిక చేసే పనిలో టీమ్ ఉంది అనేది ఆ వార్తల సారాంశం. ఇప్పుడు ఆ హీరో ఫిక్స్ అయ్యారు అని సమాచారం. బాలిస్ జోసెఫ్.. మీకు తెలుసు కదా.. ‘జయ జయ జయ జయహే’, ‘నూనక్కుళి’, ‘సూక్ష్మదర్శిని’, ‘గురువాయూర్ అంబలనదాయిల్’, ‘ప్రవిణ్‌కుడు షాపు’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయం ఉంది. అతనే ఇప్పుడు సిబి చక్రవర్తి సినిమాలో రజనీకాంత్ తనయుడిగా నటించబోతున్నాడు అని అంటున్నారు.