ENE Repeat Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘ఈఎన్ఈ రిపీట్’

విశ్వక్ సేన్ తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో 2018లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. ధియేటర్లో కంటే కూడా ఓటీటీలో, రీ రిలీజ్లో ఎక్కువ అప్రీషియేషన్ పొందింది అని చెప్పాలి. తరుణ్ భాస్కర్ ఏ సినిమా ఈవెంట్లో కనిపించినా.. ‘ ‘ఈఎన్ఈ’ సీక్వెల్ ఎప్పుడు?’ అంటూ అరుపులు వినిపించడం మనం చూశాం. వారందరి కోరికని గమనించి.. మొత్తానికి ‘ఈఎన్ఈ’ సీక్వెల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేనందుకు రెడీ అయ్యాడు తరుణ్ భాస్కర్.

ENE Repeat

‘ఈఎన్ఈ రిపీట్'(ENE Repeat) పేరుతో ఈ సీక్వెల్ రెడీ అయ్యింది. నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ’35 చిన్న కథ కాదు’ చిత్రాన్ని నిర్మించిన సుజన్ యరబోలు ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ను నిర్మించారు. క్రేజీ సీక్వెల్ కావడంతో మొదటి నుండీ ట్రేడ్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. మొదటి రోజు సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ వసూళ్ళు బాగానే నమోదయ్యాయి. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా.. 2వ రోజు కూడా అదరగొట్టింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  3.25 cr
సీడెడ్  0.29 cr
ఆంధ్ర(టోటల్)  1.38 cr
ఏపీ +తెలంగాణ(టోటల్)  4.92 cr (షేర్)
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.62 cr
ఓవర్సీస్  4.08 cr
వరల్డ్ వైడ్ టోటల్  9.62 cr (షేర్)

‘ఈ ఎన్ ఈ రిపీట్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.20 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజుల్లో ఈ చిత్రం రూ.9.62 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా పరంగా రూ.19.2 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.11.38 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus