OM: ‘ఓం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

తమిళ స్టార్ హీరో ధనుష్, మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓం'(OM). శ్రీలీల ఈ చిత్రంలో ధనుష్ కి జోడీగా నటించింది. ‘అమరన్’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన రాజ్ కుమార్ పెరియసామి ఈ చిత్రానికి దర్శకుడు. సాయి అభ్యంకార్ సంగీతంలో రూపొందిన ‘వీర వీర’ అనే పాట కొన్ని నెలల నుండీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

OM

దీంతో సినిమాకి మంచి పబ్లిసిటీ జరిగినట్టు అయ్యింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రెయిలర్ వంటివి కూడా ఆడియన్స్ ను మెప్పించాయి. అందువల్ల సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో కూడా బజ్ క్రియేట్ అయ్యింది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తుంది. ఒకసారి ఈ ‘ఓం’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు ఒకసారి పరిశీలిద్దాం రండి :

నైజాం  3 cr
సీడెడ్  1 cr
ఆంధ్ర(టోటల్)  3 cr
ఏపీ +తెలంగాణ(టోటల్)  7 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా(తెలుగు వెర్షన్)  0.30 cr
ఓవర్సీస్ (తెలుగు వెర్షన్)  0.50 cr
వరల్డ్ వైడ్ టోటల్  7.8 cr

‘ఓం’ చిత్రం తెలుగు వెర్షన్ కి వరల్డ్ వైడ్ గా రూ.7.8 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.8.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టార్గెట్ పెద్దదే అయినప్పటికీ.. క్రేజీ కాంబోలో రూపొందిన సినిమా కావడంతో.. పాజిటివ్ టాక్ కనుక వస్తే ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఫైనల్ గా ఏం చేస్తుందో..!

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus