అపజయాన్ని ఒప్పుకొన్న హీరోలు

ఏ రంగంలో వారైనా విజయం వస్తే.. మైకులు అందుకొని గంటలు గంటలు ఉపన్యాసాలు ఇస్తారు. అపజయం పలకరిస్తే దాని గురించి అడిగినా సమాధానం చెప్పడానికి దాటవేస్తుంటారు. సినిమా రంగం అందుకు అతీతం కాదు. కలెక్షన్లు వందల కోట్లు క్రాస్ చేసిన.. వందరోజులు దూసుకుపోయిన విజయోత్సవ సభలు నిర్వహిస్తుంటారు. అదే తమ సినిమా ఫ్లాప్ అయితే నోరు మెదపరు. నెక్స్ట్ ప్రాజక్ట్ గురించి మాట్లాడుతుంటారు. అయితే అతి తక్కువమంది తమ సినిమా ఫెయిల్ అయిందని నిర్మొహమాటంగా ఒప్పుకొని రియల్ హీరోలు అనిపించుకున్నారు. అటువంటి వారిపై ఫోకస్…

పవన్ కళ్యాణ్ (జూనీ, సర్ధార్ గబ్బర్ సింగ్)

వరుసగా విజయాలతో దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్.. జానీ సినిమాతో అపజయాన్ని చవిచూశారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ తో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకున్నారు. కానీ తాను స్క్రిప్ట్ లో వేలు పెట్టి మళ్ళీ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఫెయిల్ చూసారు. ఈ రెండు సినిమాలో హిట్ కాలేదని అనేక సార్లు పవన్ కళ్యాణ్ స్వయంగా ఒప్పుకున్నారు.

మహేష్ బాబు (ఆగడు)

దూకుడు కాంబినేషన్లో తెరకెక్కిన ఆగడు సినిమాపై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా ఘోర పరాజయం పొందింది. అందుకు గాను మహేష్ బాబు శ్రీమంతుడు ఆడియో రిలీజ్ వేడుకలో “లాస్ట్ టైం మిమ్మల్ని డిజప్పాయింట్ చేసాను. అందులో నా తప్పు ఏమైనా ఉంటే క్షమించండి” అంటూ ఫ్యాన్స్ ని కోరారు. అందుకే అతని అందరూ సూపర్ స్టార్ అని పిలుస్తుంటారు.

నాని (కృష్ణార్జున యుద్ధం)లో బడ్జెట్.. అత్యధిక లాభాలు.. నాని సినిమా అంటే టాలీవుడ్ లో టాక్ అలా వచ్చేసింది. వరుసగా ఏడు హిట్స్ అంటే సామాన్యం కాదు. కానీ చాలా కాలానికి కృష్ణార్జున యుద్ధం సినిమాతో అపజయాన్ని చూసారు.
అయినా ఓ ఛానల్ వాళ్ళు సూపర్ హిట్ అంటూ ప్రమోట్ చేస్తుంటే.. నాని దానిపై స్పందించారు. “సూపర్ హిట్ అంట అవ్వలేదు బాబాయ్.. ఆడలేదు కూడా, అయినా మనసు పెట్టి చేసాం చూసేయండి” అని ట్వీట్ చేసాడు.

నాగార్జున (ఆఫీసర్) అక్కినేని నాగార్జున వర్మ దర్శకత్వంలో చేసిన తొలి సినిమా శివ సినిమాకి వచ్చిన క్రేజ్ ఆఫీసర్ కి వచ్చింది. కానీ ఆ చిత్ర దరిదాపుల్లోకి కూడా ఆఫీసర్ వెళ్లలేకపోయింది. ఈ విషయాన్ని నాగ్ పరోక్షంగా ఒప్పుకున్నారు. “గుడ్ మార్నింగ్. ఒక వారం ముగిసిపోయింది. మరో సోమవారం వచ్చింది. ఈ సమయంలో విన్ స్టన్ చర్చిల్ చెప్పిన మాట గుర్తుకొస్తోంది. “విజయం అంతిమం కాదు.. అపజయం ప్రాణాంతకం కాదు. దైర్యంగా ముందుకు వెళ్ళాలి”.. అంటూ నాగ్ ట్వీట్ చేశారు. అంటే ఆఫీసర్ సినిమా ఫలితాన్ని మరిచిపోయి నెస్ట్ సినిమా గురించి ఆలోచించమని పరోక్షంగా అభిమానులకు సూచించారు.

రామ్ చరణ్ (ఆరంజ్)

మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఆరంజ్ చేసారు. ఈ సినిమా అంచనాలకు రీచ్ కాలేకపోయింది. చరణ్ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ ఫిలిం తర్వాత నాతో మూవీస్ చేయడానికి ఎవరూ రాలేదు అని స్వయంగా ఒప్పుకున్నారు.

రామ్ (జగడం)

ఎనర్జిటిక్ హీరో రామ్ కి విజయాలకంటే అపజయాలే ఎక్కువ. ఆ విషయాన్నీ నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు. ముఖ్యంగా జగడం తన కెరీర్ లో ఫ్లాప్ సినిమా అని ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

రవితేజ (నిప్పు, దేవుడు చేసిన మనుషులు, సారొచ్చారు)

సినిమా కోసం వందశాతం కష్టపడడం.. ఫలితాన్ని పట్టించుకోకపోవడం రవితేజ స్టైయిల్. అందుకే బలుపు సినిమాకి ముందు నిప్పు, దేవుడు చేసిన మనుషులు, సారొచ్చారు… సినిమాలు ఫెయిల్ అయ్యాయి. ఆ అపజయాలను అసలు పట్టించుకోనని రవితేజ స్పష్టంగా చెప్పారు.

ఎన్టీఆర్ (దమ్ము, బాద్షా, రామయ్య వస్తావయ్యా, రభస)

నూనూగు మీసాల వయసప్పుడే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరో ఎన్టీఆర్. విజయాలతో దూసుకుపోతున్న అతని కెరీర్ లో అపజయాలు వరుసగా పలకరించాయి. దమ్ము, బాద్షా, రామయ్య వస్తావయ్యా, రభస.. ఇలా నాలుగు చిత్రాలు ఫెయిల్ అయ్యాయి. ఈ విషయాన్నీ ఎన్టీఆర్ టెంపర్ ఆడియో వేడుకలో ఒప్పుకున్నారు. “నా గత రెండు మూడు సినిమాలు మిమ్మల్ని నిరాశపరిచాయి. అది నన్ను బాధించాయి” అని అభిమానులతో చెప్పుకొన్నారు. ఈసారి నిరాశపరచనని చెప్పి హిట్ కొట్టారు.

ప్రభాస్ (ఈశ్వర్, రాఘవేంద్ర)

దేశం మొత్తం బాహుబలి అని పిలిచుకుంటున్న ప్రభాస్ చేసిన మొదటి రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఈశ్వర్, రాఘవేంద్ర ప్రేక్షకులను అలరించలేకపోయాయి. వాటి తర్వాత వర్షం, ఛత్రపతి వంటి హిట్స్ వచ్చాయి. సో ఫెయిల్ అయినా విషయాన్ని ఎక్కడా ప్రస్తావించనవసరం లేదు. కానీ బాహుబలి ఆడియో వేడుకలో… “నా మొదటి రెండు సినిమాలు ఫ్లాప్ అయినా పరవాలేదు.. నాతో రాజమౌళి సినిమా చేయడానికి ముందుకు వచ్చారు” అని అందరి ముందు చెప్పి యంగ్ రెబల్ స్టార్ అనిపించుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus