అద్దిరిపోయే ట్విస్ట్ లతో వస్తోంది..! కాస్కోండి..!

నితిన్ ప్రసన్న, ప్రీతి ఆశ్రాని నటిస్తున్న సినిమా A. అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ లో మిన్సాల గీత నిర్మాతగా వస్తున్న ఈ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ ప్రేమికులని ఊరిస్తోంది. గతంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర చేసిన A సినిమా ఎంతటి సూపర్ డూపర్ హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన పోస్టర్స్ అప్పట్లో యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఉపేంద్ర యాక్టింగ్, సినిమాలో ఉన్న లవ్ ఫీల్, సాంగ్స్ ఇలా అన్నీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.

ఇప్పుడు ఇదే టైటిల్ తో వస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ అందర్నీ బాగా ఆకట్టుకుంటోంది. A సినిమా డైరెక్టర్ యుగంధర్ ముని ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా రాని కథని మేము టచ్ చేశామని చెప్తున్నారు. డిఫరెంట్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతోందని ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ చాలా హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. విజయ్ సేతుపతి విడుదల చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

రీసంట్ గా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలని సైతం పూర్తి చేస్కుంది. మార్చి 5వ తేదిన విడుదల కాబోతోంది. ట్రైలర్ చూస్తుంటే కొత్త పాయింట్ ని టచ్ చేసినట్లుగానే కనిపిస్తున్న ఈ మూవీ అందరి అంచనాలని అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus