ప్రభాస్ ని ప్రేమలో దించడానికి రెడీ అవుతున్న సుందరి
- May 20, 2017 / 06:32 AM ISTByFilmy Focus
బాహుబలి కంక్లూజన్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాలో హీరోయిన్ విషయంలో కొన్ని రోజులుగా అనేక పేర్లు వినిపిస్తున్నాయి. డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ మూవీ లో హీరోయిన్ పై చిత్ర బృందం తుది నిర్ణయం తీసుకుంది. మొదట కన్నడ బ్యూటీ రష్మిక మందనా హీరోయిన్ గా అనుకున్న డైరక్టర్ ఆమెకు హిందీలో మార్కెట్ ఉండదని పక్కన పెట్టారు.
అందుకే బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకునే ని సంప్రదించారు. కానీ ఆమె డేట్స్ ఖాళీలేదు. తర్వాత శ్రద్ధా కపూర్, దిశా పటానీనిలను అడగగా వారిద్దరూ ఎక్కువ పారితోషికం అడగడంతో వెనక్కి వచ్చారు. చివరగా పరిణీతి చోప్రాను ఫైనల్ చేసినట్లు తెలిసింది. ఈమె పేరుని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాస్ హైదరాబాద్ కి రాగానే షూటింగ్ పనులు మొదలు అవుతాయి. ప్రభాస్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















